ప్రేమ వివాహం చేసుకున్న గేయ రచయిత శ్రీమణి

తన పాటలతో తెలుగు సంగీత ప్రియులను అలరించిన శ్రీమణి ఓ ఇంటివాడయ్యారు. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో ఫొటోలతో సహా పంచుకున్నారు. ‘నా చిన్నారి దేవతా(ఫరా).. నా జీవితంలోకి స్వాగతం. ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నాం.

Updated : 21 May 2022 11:27 IST

హైదరాబాద్‌: తన పాటలతో తెలుగు సంగీత ప్రియులను అలరించిన శ్రీమణి ఓ ఇంటివాడయ్యారు. పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో ఫొటోలతో సహా పంచుకున్నారు. ‘నా చిన్నారి దేవతా(ఫరా).. నా జీవితంలోకి స్వాగతం. ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. మొత్తానికి కల నెరవేరింది. మా మనసులను అర్థం చేసుకొని మమ్మల్ని ఒకటిగా చేసిన మా తల్లిదండ్రులతో పాటు ఆ దేవుడికి కృతజ్ఞతలు’ అని ట్విటర్‌లో పోస్టు చేశారు. అంతేకాదు.. మ్యారెజ్‌ లైఫ్‌ బిగిన్స్‌ అంటూ.. హ్యాష్‌ట్యాగ్‌ కూడా పెట్టారు. 
‘100% లవ్’లో ‘ఏ స్క్వేర్‌ బీ స్క్వేర్‌..’ అంటూ శ్రీమణి  తెలుగు సినిమాకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ‘అహో బాలు’, ‘దటీజ్‌ మహాలక్ష్మి..’ పాటలు కూడా శ్రీమణి రాసినవే. ఆ తర్వాత పెద్దపెద్ద హీరోలకు పాటలు రాసే అవకాశాలు వచ్చాయి. 
జులాయి సినిమాలో ‘చక్కని బైక్‌ ఉంది..’, ‘మీ ఇంటికి ముందో గేటు..’ పాటలు రాశారు. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాలో ఆరడుగుల బుల్లెట్టు.. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాలో ‘జారుకో జారుకో..’ పాట కూడా శ్రీమణి రాసిందే. ఉప్పెన సినిమాలోనూ ‘నీకళ్లు నీలి సముద్రం’ అంటూ ఆయన రాసిన పాట సృష్టించిన రికార్డులు మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా.. శ్రీమణికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ కాస్త సరదాగా స్పందించారు ‘‘మీ రొమాంటిక్ లిరిక్స్ వెనుకున్న రహస్యం ఏంటో ఇప్పుడు అర్థమైంది. ‘ఇష్క్ సిఫాయా’ అని పాడి.. ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి.. ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లిచేసుకున్నారన్న మాట’’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని