తల్లి కాబోతున్న గాయని శ్రేయాఘోషల్‌

తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గాయని శ్రేయాఘోషల్‌ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. ఆమె త్వరలో తల్లికాబోతున్నానని....

Updated : 04 Mar 2021 13:01 IST

ముంబయి: తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న గాయని శ్రేయాఘోషల్‌ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. ఆమె త్వరలో తల్లికాబోతున్నానని తెలియజేస్తూ ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘బేబీ శ్రేయాదిత్య(శ్రేయాఘోషల్‌+షీలాదిత్య) రాబోతుంది. షీలాదిత్య, నేనూ ఈ శుభవార్తను మీతో పంచుకోవడం సంతోషకరంగా భావిస్తున్నాం. జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోన్న ఈ తరుణంలో మీ దీవెనలు మాకెంతో అవసరం’ అని శ్రేయాఘోషల్‌ తెలిపారు.

‘సరిగమ’ విజేతగా కెరీర్‌ను ఆరంభించిన శ్రేయాఘోషల్‌ బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో తన పాటలతో ప్రేక్షకుల్ని అలరించారు. ‘దేవదాస్‌’, ‘గజని’, ‘3 ఇడియట్స్‌’, ‘దిల్లీ 6’, ‘దబాంగ్‌’, ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘ఆషికీ-2’, ‘క్రిష్‌’, ‘భాఘి-2’, ‘పద్మావత్‌’ చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాది భాషల్లో సైతం శ్రేయా తన స్వరాన్ని వినిపించారు. తెలుగులో ఎన్నో మధురమైన పాటలు అలపించిన శ్రేయా ఇటీవల.. ‘ఉప్పెన’, ‘టక్‌ జగదీశ్‌’తో మరోసారి అభిమానులను మెప్పించారు.



Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని