Shriya Saran: ఆ సమస్యతో బాధపడుతూనే రాజమౌళి షూటింగ్ పూర్తిచేశారు...
పలు చిత్రాల్లో నటించిన శ్రియ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించి అలరించింది. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఈ నటి రాజమౌళి ఆరోగ్య సమస్య గురించి చెప్పింది.
హైదరాబాద్: ఒక సినిమా వెనక కొన్ని వందల మంది కష్టం దాగి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా లెక్కచేయకుండా ప్రేక్షకులను అలరించడం కోసం ఎంతో శ్రమిస్తుంది చిత్రబృందం. ఆరోగ్య సమస్యలు ఉన్నా సినిమా హిట్ అయితే అన్ని మర్చిపోతారు. సినిమా విజయంలో తెర ముందు హీరోలు నటీనటులైతే.. తెరవెనుక హీరోలు చాలా మంది ఉంటారు. అసలు విషయమేమిటంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు మందు దర్శకదిగ్గజం రాజమౌళి ఆరోగ్యసమస్యతో ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని స్టార్ హీరోయిన్ శ్రియ ఇటీవల ఓ ప్రముఖ మీడియా చానల్‌కు వెల్లడించింది.
‘‘నాకు తెలిసినంత వరకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభానికి ముందు రాజమౌళి గారు ఆస్తమాతో బాధపడ్డారు. అయినా ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఆయన దృష్టి అంతా కథను ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని మీదే ఉంటుంది. సెట్ అంతా దుమ్ము ఉన్నా అలానే వర్క్ చేస్తారు. తెరపై సినిమా అద్భుతంగా ఉండాలని తాపత్రయపడతారు’’ అంటూ రాజమౌళికి సినిమా అంటే ఎంత ఇష్టమో చెప్పింది శ్రియ.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్ల పరంగానే కాదు అవార్డులోనూ రికార్డులు సృష్టిస్తోంది. జాతీయ, అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా సన్‌సెట్ సర్కిల్ అవార్డు (Sunset Circle Awards)ల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ విజేతగా నిలిచింది. అలాగే శాటర్న్ అవార్డు ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ను వరించింది. ఇక ఈ దృశ్యకావ్యం ఆస్కార్ బరిలో దిగిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం
-
Movies News
Social Look: ఆ హీరోతో ఫొటో దిగినందుకు ఖుష్బూ సుందర్ ఆనందం.. పులివెందులలో అషు!
-
India News
IndiGo: అత్యవసర ద్వారం కవర్ తొలగింపు యత్నం.. విమానం గాల్లో ఉండగా ఘటన!
-
Technology News
E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్ అడుగులు!
-
General News
TTD: తిరుమలలో ఆగమశాస్త్రాన్ని విస్మరిస్తున్నారు: రమణ దీక్షితులు