Shriya saran: పెళ్లినాటి తీపిగుర్తులు పంచుకున్న శ్రియ...!

వివాహబంధం ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని అందమైన సంఘటన. ఇక ఆ వేడుకలో తీసుకున్న ఫొటోలు జీవితాన ఎప్పటికీ గుర్తుండిపోయే తీపిగుర్తులు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..

Published : 27 Sep 2022 12:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాహబంధం ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని అందమైన ఘటన. ఇక ఆ వేడుకలో తీసుకున్న ఫొటోలు జీవితాన ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి గుర్తులు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా.. నటి శ్రియ తన పెళ్లిరోజు ఫొటోలను పంచుకుని మురిసిపోయింది. 2018లో శ్రియ వివాహం జరిగిన విషయం తెలిసిందే.. అప్పుడు శ్రియ వాళ్ల తల్లిదండ్రులతో కలిసి తీయించుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

శ్రియ తల్లిదండ్రుల పుట్టినరోజులు ఒకే రోజు కావడంతో ఆమె వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. తన పెళ్లిలో వారితో తీయించుకున్న ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘అమ్మా, నాన్న మీఇద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రపంచంలోనే ఉత్తమమైన తల్లిదండ్రలు. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్రియ ‘దృశ్యం2’లో అజయ్‌ దేవగణ్‌ సరసన నటించనుంది. దీంతోపాటు సుదీప్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రానున్న ఈ సినిమా పలు భాషల్లో విడుదలవ్వనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని