Salaar: ప్రభాస్‌తో నటించడం అద్భుతం: శ్రుతిహాసన్
ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్ (Prabhas) చాలా సరదాగా ఉంటారని, ఆయనతో కలిసి నటించడం ఓ అద్భుతమని శ్రుతిహాసన్ (Shruti Haasan) అన్నారు. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ (Salaar). ‘కేజీయఫ్’ (KGF) ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో పాల్గొన్న శ్రుతిహాసన్ ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభాస్, సినిమా గురించి మాట్లాడారు. ‘‘నాకు ప్రశాంత్ నీల్ చిత్రాలంటే చాలా ఇష్టం. తన కథలతో ఆయన ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంటారు. అలాంటి ప్రయాణంలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది. చిత్ర బృందమంతా ఎంతో సహకారం అందిస్తోంది. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం అద్భుతం’’ అని శ్రుతిహాసన్ తెలిపారు. ఈ చిత్రంలో తాను పోషిస్తున్న ఆద్య పాత్ర గురించి ఇప్పుడే ఏ వివరాలు బయటపెట్టలేనన్నారు.
సూపర్ హిట్ చిత్రం ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, ప్రభాస్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారని తెలియడంతో ‘సలార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్)తో బిజీగా ఉన్నారు ప్రభాస్. ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. శ్రుతిహాసన్.. బాలకృష్ణ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రానికి #NBK107 అనేది వర్కింగ్ టైటిల్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్‌లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
-
Crime News
Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- CWG 2022: కొవిడ్ అని తేలినా ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్..ఎలా!
- Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!
- RGUKT: అంధకారంలో బాసర ట్రిపుల్ ఐటీ.. చీకట్లోనే విద్యార్థులు భోజనం!
- Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు