Shruthi Hassan: బిగ్‌బాస్-5 హోస్ట్‌గా శ్రుతిహాసన్‌?

 బిగ్‌బాస్‌ సీజన్‌-5 తమిళ్‌కి హోస్ట్‌గా శ్రుతిహాసన్‌ అనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించే ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ సోమవారం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న కమల్‌ స్వల్ప కరోనా లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Published : 23 Nov 2021 20:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5 తమిళానికి హోస్ట్‌గా శ్రుతిహాసన్‌ చేస్తుందనే అనే వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ కార్యక్రమానికి ఇన్నిరోజులు హోస్ట్‌గా చేసిన ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ సోమవారం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్న కమల్‌కు స్వల్ప కరోనా లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో ఐసోలేట్‌ అయి చికిత్స తీసుకుంటున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారాయన. ప్రస్తుతం తమిళ్‌ బిగ్‌బాస్‌-5లో ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కమల్‌ స్థానంలో తాత్కాలికంగా..ఆయన  కుమార్తె శ్రుతిని తీసుకున్నారనే మాట తెగ వినిపిస్తోంది. కమల్‌.. తన స్టైల్‌తో కంటెస్టెంట్లతో విభిన్నంగా వ్యవహరిస్తారని..  అంతటి స్థాయిలో ఎవరు మెప్పించగలరు? కొన్ని రోజుల పాటు షోను ఆసక్తికరంగా ఎవరు నడిపించగలరు? ఇలా పలు కోణాల్లో ఆలోచించిన షో మేకర్స్‌ ముందుగా శ్రుతిహాసన్‌ని సంప్రదించారట. దీనిపై శ్రుతి త్వరలో ఓ క్లారిటీ ఇవ్వనుంది. తెలుగులో గతేడాది బిగ్‌బాస్-4లో షూటింగ్‌ కారణంగా నటుడు నాగార్జున పాల్గొనలేని సందర్భాల్లో నటి రమ్యకృష్ణ, సమంత ఆయన స్థానంలో ప్రేక్షకులను అలరించారు. మరి తమిళ్‌ బిగ్‌బాస్‌లో ఏమువుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు మరి!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని