Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్‌

తాను అనారోగ్యానికి గురైనట్టు వార్తలొస్తున్నాయని, వాటిల్లో ఎలాంటి నిజం లేదని నటి శ్రుతిహాసన్‌ తెలిపారు. ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా నా వ్యాయామానికి సంబంధించిన వీడియో పంచుకున్నా.

Published : 06 Jul 2022 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను అనారోగ్యానికి గురైనట్టు వార్తలొస్తున్నాయని, వాటిలో ఎలాంటి నిజం లేదని నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan) స్పష్టంచేశారు. ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా నా వ్యాయామానికి సంబంధించిన వీడియో పంచుకున్నా. పీసీఓఎస్‌ (పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌)ను ఛాలెంజ్‌గా తీసుకుని అలా చేశానని పేర్కొన్నా. ఆ పోస్ట్‌ను పూర్తిగా చదవకుండా కొన్ని మీడియా సంస్థలు నాకేదో తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయంటూ రాశాయి. నాకు కొన్నేళ్ల నుంచి ‘పీసీఓఎస్‌’ ఉంది. అంతే తప్ప అంతకుమించి మరేం లేదు. ప్రస్తుతం నేను క్షేమంగానే ఉన్నా’’ అని శ్రుతిహాసన్‌ స్పష్టం చేశారు.

ఆ వీడియో సంగతి ఇదీ

‘‘పీసీఓఎస్‌, ఎండోమెట్రియోసిస్‌ వల్ల హార్మోన్ల సమస్య ఎదురైంది. ఇది ఎంత కష్టమైందో మహిళలకు తెలుసు. అయితే దీన్ని నేను ఓ పోరాటంలా కాకుండా సహజమైన మార్పుగా స్వీకరిస్తున్నా. దానికి తగ్గట్టు నా శరీరానికి పని చెప్తున్నా. ప్రస్తుతానికి నా శరీరం ఎలా ఉన్నా  మనసు చాలా బావుంది. బాగా తింటున్నా, నిద్రపోతున్నా, వ్యాయామాన్నీ ఆస్వాదిస్తున్నా’’ అంటూ తన వర్కౌట్‌ వీడియోను శ్రుతిహాసన్‌ ఇటీవల షేర్‌ చేశారు. గతేడాది.. ‘క్రాక్’, ‘వకీల్‌సాబ్‌’ విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు శ్రుతిహాసన్‌. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’ (Salaar), #NBK107 (బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం) సినిమాలో నటిస్తున్నారు. ‘కేజీయఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’, గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో ‘ఎన్బీకే 107’ తెరకెక్కుతున్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని