Shruti Haasan: నెటిజన్‌ ప్రశ్న.. శ్రుతి హాసన్‌ అసహనం.. కారణమదేనా?

ఓ నెటిజన్‌ ప్రశ్నపై శ్రుతిహాసన్‌ అసహనం వ్యక్తంచేశారు. ఏమైందంటే?

Published : 21 Jun 2024 13:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నపై నటి శ్రుతి హాసన్‌ (Shruti Haasan) అసహనం వ్యక్తంచేశారు. ‘మాలా ఉండేందుకు ప్రయత్నించకండి’ అంటూ సదరు వ్యక్తికి సూచించారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి తన సినిమాల విశేషాలతోపాటు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ముచ్చటిస్తుంటారనే సంగతి తెలిసిందే. ‘సౌత్‌ ఇండియన్‌ యాసలో ఏదైనా చెప్పండి’ అంటూ సదరు నెటిజన్‌ కోరగా ఆమె స్పందించారు.

‘కల్కి 2898 ఏడీ’లో మలయాళ నటి.. ఎవరీ అన్నా బెన్‌?

‘‘ఓకే.. ఇలాంటి వివక్షలే వద్దు. మీరు మమ్మల్ని చూసి ఇడ్లీ, సాంబార్‌ అని అనడం సరైంది కాదు. మీరు మమ్మల్ని అనుకరించలేరు. మాలాగా ఉండేందుకు ప్రయత్నించొద్దు’’ అని అన్నారు. బాలీవుడ్‌ నటులు.. దక్షిణాది నటులను చిన్నచూపు చూస్తుంటారని, దాన్ని దృష్టిలోపెట్టుకుని ఆమె ఇలా సమాధానం ఇచ్చారేమోనని పలువురు అభిమానులు అభిప్రాయం వ్యక్తంచేశారు. పలు సినీ వెబ్‌సైట్స్‌ సైతం ఈ కోణంలోనే కథనాలు రాశాయి. కొన్ని నెలల క్రితం జరిగిన ఓ పెళ్లి వేడుకలో బాలీవుడ్‌ హీరో ఒకరు.. దక్షిణాది హీరోను చులకనగా చూడడమే శ్రుతి అసహనానికి కారణమై ఉండొచ్చని పేర్కొన్నాయి.

ఇటీవల తన రిలేషన్‌ స్టేటస్‌ గురించి తెలిపిన సంగతి తెలిసిందే. ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా?’ అని సోషల్‌ మీడియా వేదికగా ఒకరు ప్రశ్నించగా తనకు ఆ తరహా ప్రశ్నలు నచ్చవంటూనే సింగిలే అని క్లారిటీ ఇచ్చారు. రిలేషన్‌ కోసం ఎదురుచూస్తున్నానన్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘డకాయిట్‌’ (Dacoit: A Love Story), ‘చెన్నై స్టోరీ’ల్లో నటిస్తున్నారు. ‘సలార్‌’ సీక్వెల్‌ ‘సలార్‌ 2’ (Salaar 2)లోనూ సందడి చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని