Shruti Haasan: అదే ప్రమాదకరం

సినిమాల్లో ఎన్ని దుస్తులు మార్చినా.. ఎన్ని పాత్రలు పోషించినా.. నిజ జీవితంలో మనసుకు నచ్చినట్లుగానే జీవిస్తానని చెబుతోంది శ్రుతిహాసన్‌. జీవితంలో అత్యంత కష్టమైన విషయం ఏమిటని ప్రశ్నిస్తే ఎదుటి వ్యక్తికి నచ్చేలా బతకడమని బదులిచ్చింది.

Updated : 03 Dec 2022 08:58 IST

సినిమాల్లో ఎన్ని దుస్తులు మార్చినా.. ఎన్ని పాత్రలు పోషించినా.. నిజ జీవితంలో మనసుకు నచ్చినట్లుగానే జీవిస్తానని చెబుతోంది శ్రుతిహాసన్‌ (Shruti Haasan). జీవితంలో అత్యంత కష్టమైన విషయం ఏమిటని ప్రశ్నిస్తే ఎదుటి వ్యక్తికి నచ్చేలా బతకడమని బదులిచ్చింది. ‘‘అందరికీ నచ్చేలా వస్త్రధారణ చేసుకోవడం, మాట్లాడటం, ప్రవర్తించడం, ప్రపంచాన్ని ఆవిష్కరించడం.. ఇవే జీవితంలో అత్యంత కష్టమైన పనులు. ఎందుకంటే మనల్ని ఎదుటి వాళ్లు ఎలా ఆమోదిస్తున్నారనేది ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. అదే ప్రమాదకరం. అందుకే అందరినీ తృప్తిపరచాలని అనుకోకుండా.. మనసుకు సంతోషం అనిపించేలా ఉండటం, ప్రవర్తించడం చాలా ముఖ్యం. నేనెప్పుడూ అలా జీవించడానికే ఇష్టపడతా’’ అని చెప్పుకొచ్చింది శ్రుతి. ప్రస్తుతం ఆమె నటించిన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘సలార్‌’ సెట్స్‌పై ముస్తాబవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని