Shruti Haasan: కమల్‌ హాసన్ బయోపిక్‌.. శ్రుతి హాసన్‌ రియాక్షనిదే

కమల్‌ హాసన్‌ బయోపిక్‌కు దర్శకత్వం వహించడంపై శ్రుతి హాసన్‌ మాట్లాడారు. తన దృష్టిలో ఆయన సూపర్‌ హీరో అన్నారు. 

Published : 17 Jun 2024 10:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ లాగే ఆయన కుమార్తె శ్రుతిహాసన్‌ కూడా మల్టీ టాలెంటెడ్‌ అనిపించుకుంటున్నారు. హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్‌గా మ్యూజిక్‌ అల్బమ్‌లు విడుదల చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఆమె (Shruti Haasan) కమల్‌ హాసన్‌ బయోపిక్‌ గురించి మాట్లాడారు. తన తండ్రితో ఉండే అనుబంధాన్ని పంచుకున్నారు.

‘నా దృష్టిలో మా నాన్న సూపర్‌ హీరో. ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. దర్శకులు కథలు చెబుతుంటే.. తరగతి గదిలో పిల్లాడిలా వింటారు. దర్శకత్వం అనేది ఎన్నో బాధ్యతలతో కూడిన పని. ఎందరికో స్ఫూర్తినిస్తుంది. నాన్న బయోపిక్‌కు నేను దర్శకత్వం వహించలేను. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి నేను సరైన వ్యక్తిని కాదు. నేను తీస్తే అది నావైపు నుంచి తీసినట్లు పక్షపాతంగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప దర్శకులు ఉన్నారు. వాళ్లైతే అద్భుతంగా తెరకెక్కించగలరు’ అన్నారు. ఇటీవల ‘ఇండియన్‌ 2’ ఆడియో రిలీజ్‌ వేదికపై కమల్‌హాసన్‌ పాటలతో శ్రుతి హాసన్‌ అలరించారు. తన తండ్రి (Kamal Haasan) సినిమాలోని పాటలను ఆలపించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు.

తుపాను ముందు నిశ్శబ్దం.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

సినిమాల విషయానికొస్తే.. గతేడాది ఐదు చిత్రాలతో వినోదాన్ని పంచిన శ్రుతి హాసన్‌ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ‘సలార్’కు కొనసాగింపుగా రానున్న ‘సలార్‌ శౌర్యంగపర్వం’లో కనిపించనున్నారు. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. అడివిశేష్‌ హీరోగా రానున్న ‘డకాయిట్‌’లో ఆమె నటిస్తున్నారు. ‘చెన్నై స్టోరీ’లోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని