BRO: ‘బ్రో’ ఐటెమ్ సాంగ్ కోసం ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు..!
పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ (BRO) సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ షేర్ అవుతోంది. ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం ఇద్దరు భామల పేర్లు పరిశీలిస్తున్నారని టాక్.
హైదరాబాద్: పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)తో కలిసి నటిస్తోన్న సినిమా ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకత్వంలో రానున్న మెగా మల్టీస్టారర్ విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతోంది చిత్రబృందం. తాజాగా ఈ మూవీపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ సినిమాలో ఒక మాస్ ఐటెమ్ సాంగ్‌ను పెట్టాలని ప్లాన్ చేస్తోందట మూవీ యూనిట్. ఆ పాట కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్లను కూడా సంప్రదించారట. అందులో శ్రుతి హాసన్ (Shruti Haasan), దిశా పటానీ (Disha Patani) పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరిలో ఒకరు ఈ సినిమాలో ఆడిపాడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఐటెమ్ సాంగ్ కోసం పబ్ సెట్‌ను కూడా సిద్ధం చేశారు. త్వరలోనే దీని షూటింగ్ జరగనుంది. ఇక ఈ పాటలో పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ ఇద్దరూ కనిపించనున్నారట. మరి వీళ్లిద్దరితో కలిసి డ్యాన్స్ చేయనున్న హీరోయిన్ ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
ఇద్దరు మెగా హీరోలు కలిసి నటిస్తోన్న ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరోసారి భగవంతుడిగా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్‌ను కూడా ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: అప్పటికే భారత ఆటగాళ్లలో అలసట కనిపించింది: సునీల్ గావస్కర్
-
Movies News
Sirf Ek Bandaa Kaafi Hai Review: రివ్యూ: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
-
World News
USA: రంగంలోకి పెన్స్.. ట్రంప్‌తో పోటీకి సై..!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. తండ్రీకుమారుడికి బెయిల్ మంజూరు
-
Movies News
varun tej: మెగా ఇంట పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ నిశ్చితార్థంపై ప్రకటన!
-
Politics News
Opposition Meet: ‘450 స్థానాల్లో భాజపాపై ఒక్కరే పోటీ’.. విపక్షాల వ్యూహం ఇదేనా..?