Shruti Haasan: అమ్మాయిలను ఆ ఒక్క ప్రశ్న అడగొద్దు: శ్రుతి హాసన్‌

శ్రుతి హాసన్‌ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఫన్నీ రిప్లై ఇచ్చారు.

Updated : 04 Jul 2024 17:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సినిమాలతో బిజీగా ఉంటూనే అభిమానులతో ముచ్చటిస్తుంటారు నటి శ్రుతి హాసన్‌. తాజాగా ఇన్‌స్టాలో తన ఫాలోవర్స్‌తో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రుతి ‘ప్రేమ’కు అర్థం చెబుతూ.. అది ఒక అద్భుతమైన భావన అన్నారు. మన జీవితాల్ని నడిపించేది ప్రేమేనని.. ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని ప్రేమించాలని సూచించారు. పెళ్లి గురించి కొందరు ప్రశ్నించడంపై కాస్త అసహనం వ్యక్తంచేశారు.

మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారని ఓ నెటిజన్‌ అడగ్గా.. ‘నేను చేసుకోను సర్‌’ అని ఫన్నీ రిప్లై ఇచ్చారు. మీకు కాబోయే భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారని మరో అభిమాని ప్రశ్నించగా.. ‘ఇది 2024.. అమ్మాయిలను ఇలాంటి ప్రశ్నలు అడగడం ఆపేయండి. ఇవి చాలా సిల్లీగా అనిపిస్తాయి. అమ్మాయిలకు ఏది సంతోషాన్నిస్తుందో.. ఆ పనిని చేసుకోనివ్వండి’ అని సమాధానమిచ్చారు. ఇకపోతే,  ఇటీవల కూడా తనను రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగొద్దని శ్రుతి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా?’ అని సోషల్‌ మీడియా వేదికగా ఒకరు ప్రశ్నించారు. దీంతో తనకు ఆ తరహా ప్రశ్నలు నచ్చవంటూనే సింగిలే అని క్లారిటీ ఇచ్చారు శ్రుతి. రిలేషన్‌ కోసం ఎదురుచూస్తున్నానన్నారు. దిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో ఆమె (Shruti Haasan) ప్రేమలో ఉన్నట్లు నాలుగేళ్ల క్రితం ప్రకటించగా.. ఇటీవలే వీళ్లిద్దరికీ బ్రేకప్‌ అయిన సంగతి తెలిసిందే.

శరవేగంగా ‘విశ్వంభర’.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే!

ప్రస్తుతం శ్రుతి సినిమాలతో పాటు ప్రైవేటు ఆల్బమ్స్‌తోనూ పలకరిస్తున్నారు. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో కలిసి ‘ఇనిమేల్’ అంటూ ప్రత్యేక గీతంతో అలరించారు. అలాగే ‘డకాయిట్‌’ (Dacoit: A Love Story), ‘చెన్నై స్టోరీ’ల్లో నటిస్తున్నారు. ‘సలార్‌’ సీక్వెల్‌ ‘సలార్‌ 2’ (Salaar 2)లోనూ సందడి చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని