Shruti Haasan: ఆ విషయంలో హీరోయిన్స్‌ అందరూ కలిసికట్టుగా ఉండాలి: శ్రుతి హాసన్‌

హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ (Shruti Haasan) తాజాగా నటీనటుల వేతన వ్యత్యాసాల గురించి మాట్లాడారు. ఈ విషయంపై హీరోయిన్స్‌ అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పారు.

Published : 24 May 2023 12:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ రంగంలో నటీనటులకు ఇచ్చే వేతనాల్లో వ్యత్యాసాలు చూపుతున్నారని చాలామంది తారలు బహిరంగంగానే చెబుతున్నారు. కొందరు స్టార్‌ హీరోయిన్స్‌ పలు ఇంటర్వ్యూల్లో ఈ అంశం గురించి మాట్లాడగా.. మరి కొందరు సోషల్‌మీడియా వేదికగా దీనిపై వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. తాజాగా హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ (Shruti Haasan) దీనిపై మాట్లాడారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు (Cannes 2023) వెళ్లిన ఆమె ఓ మీడియాతో ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో వేతన వ్యత్యాసాలు ఉన్నాయా అనే ప్రశ్నకు శ్రుతి సమాధానం చెప్పారు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే ఇది అన్ని చోట్లా ఉంటుంది. మనమంతా లింగ సమానత్వం గురించి ఎన్నో కలలు కన్నాం.  మహిళల భద్రత, బాలికలకు విద్య, పరిశుభ్రత, మంచి ఆరోగ్యం ఇలాంటి ఎన్నో అంశాలు పరిష్కరించాల్సి ఉంది. వినోద రంగానికి సంబంధించినంత వరకు ఎన్నో విషయాల్లో మార్పు ఇప్పుడిప్పుడే మొదలైంది. నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ అది కచ్చితంగా కొనసాగుతుంది. నేను కూడా కొన్నిసార్లు తక్కువ పారితోషికం తీసుకున్న సందర్భాలున్నాయి. కానీ నేనేప్పుడు ఈ విషయంలో బాధపడలేదు. ఎందుకంటే నాకు కావలసినంత పని ఉంది. అందులోనే నాకు ఆనందం ఉంటుంది. ఇక రెమ్యూనరేషన్‌ విషయంలో నటీమణులంతా కలిసికట్టుగా ఉండాలి’’ అని చెప్పారు.

ఇక తన సినీ ప్రయాణం గురించి మాట్లాడిన శ్రుతి.. ‘‘నా కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ప్రతి ఘటన నుంచి ఎదో విషయాన్ని నేర్చుకున్నాను. ఎప్పుడు పశ్చాత్తాపడలేదు. చేసిన తప్పులను మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నా. ఇంత గొప్ప వృత్తిలో కొనసాగుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను’’ అని తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు సూపర్‌ హిట్‌ చిత్రాలను ఈ అమ్మడు తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే పవన్‌ కల్యాణ్‌- సాయి ధరమ్‌తేజ్‌ల ‘బ్రో’ (BRO) లో ఐటెమ్‌ సాంగ్‌లో శ్రుతి నటించనున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు