శ్రుతిహాసన్‌కు టైమ్‌ మెషీన్‌ దొరికితే..?

స్టార్‌ హీరో ఇంట్లో పుట్టినప్పటికీ కథల ఎంపికలో తనదైన శైలి ప్రదర్శిస్తూ.. దక్షిణాదిలో అత్యంత విజయవంతమైన నటిగా పేరు తెచ్చుకుంది కమల్‌ హాసన్‌ తనయ శ్రుతిహాసన్‌. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ స్టార్‌ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

Updated : 15 Apr 2021 10:12 IST

పవన్‌.. ప్రభాస్‌.. మహేశ్‌ గురించి ఏం చెప్పిందంటే..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో ఇంట్లో పుట్టినా.. కథల ఎంపికలో తనదైన శైలి ప్రదర్శిస్తూ.. దక్షిణాదిలో అత్యంత విజయవంతమైన నటిగా పేరు తెచ్చుకుంది కమల్‌ హాసన్‌ తనయ శ్రుతిహాసన్‌. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ స్టార్‌ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌, మహేశ్‌బాబు వంటి అగ్రనటులతో సినిమాలు చేసిందామె. తాజాగా.. ట్విటర్‌లో తన అభిమానులతో సరదాగా ముచ్చటించిందీ చెన్నై చిన్నది. టైమ్‌ మెషీన్‌ దొరికితే ఏం చేస్తారు?నలుపురంగు ఎందుకు ఇష్టం? తదితర ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది. అవేంటో మీకోసం..

మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి ఎవరు?

చాలామంది ఉన్నారు. వాళ్లను చూసి ఎంతో నేర్చుకుంటూ ఉంటా.

సంగీతం, నటన.. రెండింట్లో ఒకటి మాత్రమే అంటే దేన్ని ఎంపిక చేసుకుంటారు?

అదృష్టవశాత్తూ నేను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు

కాఫీ.. టీ..?

నేను కాఫీ అసలే తాగను. కాబట్టి టీ అంటే ఇష్టం

పవన్‌కల్యాణ్‌తో కలిసి మూడోసారి పనిచేయడం ఎలా ఉంది? 

అద్భుతం. మూడోసారి ఆయనతో పనిచేయడం నా అదృష్టం

పవన్‌కల్యాణ్‌ గురించి ఒక్క పదం..?

మహనీయుడు

మీమ్స్‌ చేసేవాళ్ల మీద మీ అభిప్రాయం?

అది కూడా ఒక మంచి టాలెంట్‌

మీరు నటి కాకపోయి ఉంటే ఏం చేసేవారు?

ఏదో ఒకటి క్రియేటివ్‌గా చేసేదాన్ని

మీరు మొబైల్‌ఫోన్లో ఏ గేమ్‌ ఆడతారు?

బబుల్‌ విట్జ్‌, క్యాండీ క్రష్‌, సోడా పాప్‌ క్రష్‌

మార్వెల్‌, డీసీ..?

డీసీ(సూపర్‌ హీరో ఫిల్మ్‌ సిరీస్‌)

జసిన్‌ బీబర్‌ గురించి..?

నా ఫేవరెట్‌ కాదు(నవ్వుతూ)

నాగచైతన్యతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

చైతూ చాలా మంచి వ్యక్తి. అతనితో కలిసి పనిచేయడం నాకొక మధురమైన అనుభవం

మీరు ఐస్‌క్రీమ్‌ తింటారా?

తింటా. నాకు చాలా ఇష్టం. ఇంట్లో కూడా చేస్తా

మీరు ఇప్పుడు ఎక్కడున్నారు?

ముంబయి

మీరు ఏ నటుడిని ఎక్కువగా ఆరాధిస్తారు?

కేట్ బ్లాంచెట్(నటి)

మీరు బాగా సౌకర్యవంతంగా భావించిన నటులు ఎవరు?

చాలా మంది ఉన్నారు. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని
 

స్కూల్‌ దశలో మీ క్రష్‌ ఎవరు..?

హృతిక్‌రోషన్‌, లియోనార్డో డి కాప్రియో కోట్

డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

ఆయన చాలా స్పష్టత గల మనిషి. ఎంతో ప్రశాంతంగా ఉంటారు

మిమ్మల్ని ప్రేరేపించే విషయం?

మహిళలు, బాలల హక్కులు. వాళ్ల రక్షణ, సంక్షేమం

హీరో నాని గురించి కొన్ని మాటలు

ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఒక అద్భుతమైన వ్యక్తి

మీరు చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించే వ్యక్తిని కలుసుకున్నప్పుడు మీ అనుభవం..?

టోరి అమోస్.. నా అభిమాన మ్యూజిషియన్‌. లండన్‌లో ఉన్నప్పుడు కాఫీ షాప్‌లో ఆమెను చూసి పరిగెత్తుకెళ్లాను. ఉద్వేగానికి లోనై కన్నీళ్లు కూడా పెట్టుకున్నాను.

మీకు ఇష్టమైన హాలీవుడ్‌ చిత్రం

ది గాడ్‌ ఫాదర్‌

మీ వాట్సాప్‌ నంబర్‌ ఇవ్వండి..?
100

మీకు ఒకవేళ టైమ్‌ మెషీన్‌ దొరికితే.. మళ్లీ గతంలో ఏ క్లాస్‌లో కూర్చుంటారు?

8వ తరగతి. బోర్డు పరీక్షలు ఉండవు. ఆ సంవత్సరం నాకు చాలా ఇష్టం

మీకు ఇష్టమైన రంగు?
నలుపు

ఈ మధ్య మీ జీవితంలో జరిగిన గొప్ప విషయం?

నాతో నేను ప్రేమలో పడటం ఎలాగో నేర్చుకున్నాను

గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్: హౌస్ ఆఫ్ ది డ్రాగన్ గురించి మీరు కూడా ఎదురుచూస్తున్నారా?

అవును.. నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను. గత సీజనే అందుకు కారణం.

మీకు నచ్చిన వెబ్‌ సిరీస్‌?

పీకీ బ్లైండర్స్‌ అండ్‌ ది క్రౌన్‌

హాలీవుడ్‌లో ఫేవరెట్‌ యాక్షన్‌ చిత్రం?

ఎంటర్‌ ది డ్రాగన్‌, కిల్‌ బిల్‌

మిమ్మల్ని సంతోషంగా ఉంచే మూడు విషయాలు?

నిజం, నిద్ర, కౌగిలింత

మీకు ఇష్టమైన భోజనం?

సాంబార్‌ అన్నం, దోశ

మీ నుంచి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు ఆశించవచ్చా?

స్క్రిప్ట్‌ నచ్చితే కచ్చితంగా చేస్తా

మీరు సందర్శించాలకునే ప్రదేశం?

జపాన్‌

కమల్‌హాసన్‌ నుంచి నేర్చుకున్న విషయం?

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం.. ఎప్పటికీ వెనకడుగు వేయకపోవడం

కీర్తి సురేశ్‌ గురించి..?

మహానటిలో ఆమె నటన నాకు చాలా ఇష్టం

కొవిడ్‌19 లాక్‌డౌన్‌ సమయంలో మీరు నేర్చుకున్నది?

ఓపికగా ఎలా ఉండాలో నేర్చుకున్నా

క్రాక్, వకీల్‌సాబ్‌ రెండు సినిమాలు విజయం సాధించాయి.. ఎలా ఫీల్‌ అవుతున్నారు?

చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ప్రాజెక్టుల్లో నేను ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను

టైమ్‌ ట్రావెల్‌ చేసే శక్తి వస్తే ఏం చేస్తారు?

గతంలోకి వెళ్లి పిరమిడ్లు ఎలా నిర్మించారో తెలుసుకుంటా

ఇతరులను భయపెట్టేలా మీరు చేసే పని ఏంటి?

నాకు నేను ఎక్కువగా మాట్లాడుకుంటా

మహేశ్‌బాబు గురించి ఒక్క మాటలో?

జెంటిల్‌మన్‌

మీకు ఇష్టమైన సబ్జెక్టు

హిస్టరీ, బయోలజీ

రామ్‌చరణ్‌ గురించి..?

స్వీటెస్ట్‌

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారా?

ఇంకా లేదు. త్వరలోనే తీసుకుంటా

ప్రభాస్‌ గురించి..?

అతనితో పనిచేయడం ఇష్టం

ప్రతి సారి నలుపురంగు దుస్తుల్లో కనిపిస్తారు.. రహస్యం ఏంటి?

నలుపు రంగంటే నాకు చాలా ఇష్టం. ఆహారం తినేటప్పుడు మీద పడ్డా మరకలు కావు(నవ్వుతూ)

భవిష్యత్తులో సినిమా డైరెక్ట్ చేస్తారా?

హ్మ్‌....

‘ఈనాడు’ ఆల్బమ్‌ నాకు ఎంతో ఇష్టం. మళ్లీ మ్యూజిక్‌ డైరెక్షన్‌ ఎప్పుడు ప్రారంభిస్తారు?

చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నేను నా సొంత ఇండీ సంగీతంపై ఎక్కువ దృష్టి పెట్టాను

మీరు డేట్‌కు వెళ్లాలనుకుంటే ఎవరికి ప్రాధాన్యం ఇస్తారు?

డేట్‌ అనేది ప్రాధాన్యం కాదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు