భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసుప్రసాద్
‘ఎక్కాడా.. ఎప్పూడూ’ అంటూ విభిన్నంగా మాట్లాడి.. స్వప్నగా తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి శ్వేతాబసుప్రసాద్. ‘కొత్త బంగారులోకం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో...
విడాకుల గురించి నటి వైరల్ కామెంట్స్
హైదరాబాద్: ‘ఎక్కాడా.. ఎప్పూడూ’ అంటూ విభిన్నంగా మాట్లాడి.. స్వప్నగా తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి శ్వేతాబసుప్రసాద్. ‘కొత్త బంగారులోకం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించారు. కెరీర్ ఆరంభంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె అదే సమయంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోహిత్ మిట్టల్ అనే దర్శకుడిని 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనుకోని కారణాల వల్ల ఎనిమిది నెలలకే వీరిద్దరూ విడిపోయారు.
కాగా, తాజాగా నటి శ్వేతాబసుప్రసాద్.. రోహిత్‌తో విడిపోవడం గురించి స్పందించారు. పరస్పర అంగీకారంతోనే తామిద్దరం విడిపోయామని ఆమె తెలిపారు. అంతేకాకుండా అది ఒక బ్రేకప్‌లా ఉందన్నారు. ‘కొన్ని కారణాలతో మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. వివాహం జరిగిన పదేళ్లు లేదా దానికంటే ఎక్కువ సంవత్సరాలైన తర్వాత కూడా కొంతమంది దంపతులు తమ బంధానికి స్వస్తి చెప్పడం మనం చూస్తేనే ఉన్నాం. కానీ, మేమిద్దరం ఎనిమిది నెలల్లోనే దూరం కావాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని విడాకులనే పెద్ద పదంతో పోల్చడం కంటే.. ఇది ఓ బ్రేకప్‌లా ఉందనిపిస్తోంది. రోహిత్‌కు దూరమైన సమయంలో ఎంతో బాధపడ్డాను. కుటుంబం, స్నేహితులు నాకు అండగా ఉన్నారు. నాకు నేను ఓ మంచి స్నేహితురాలిగా మారాను’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?