‘శ్యామ్‌ సింగరాయ్‌’కు భారీ డిమాండ్‌?

నాని, సాయి పల్లవి జంటగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శ్యామ్‌ సింగరాయ్‌’. కృతిశెట్టి,

Published : 24 Apr 2021 01:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాని, సాయి పల్లవి జంటగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘శ్యామ్‌ సింగరాయ్‌’. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియిన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. కోల్‌కతాను తలపించేలా భారీ సెట్‌ను రూపొందించారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5కోట్లతో దీన్ని తీర్చిదిద్ది కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడిందట. ప్రముఖ ఓటీటీ వేదికలతో పాటు, సన్‌, స్టార్‌, జీ నెట్‌వర్క్‌లు భారీ మొత్తంలో ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని టాలీవుడ్‌లో టాక్‌. అదే విధంగా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని