
ShyamSingha Roy: శ్యామ్ సింగరాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ? ఎప్పుడంటే?
హైదరాబాద్: ‘ఈ క్రిస్మస్ మనదే’ అంటూ గతేడాది ‘శ్యామ్ సింగరాయ్’తో (Shyam Singha Roy) థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనుకున్నట్టుగానే విజయాన్ని అందుకున్నారు నటుడు నాని (Nani). దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన నటించిన చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతోన్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రేక్షకులు సినిమాహాళ్లకు వచ్చేందుకు కాస్త భయపడుతున్నారు. దీంతో ‘శ్యామ్ సింగరాయ్’ ఓటీటీ విడుదల కోసం పలువురు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘శ్యామ్ సింగరాయ్’ ఓటీటీ విడుదలపై ఓ స్పష్టత వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 21 నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
పవర్‌ఫుల్ కథాంశంతో రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో నాని.. శ్యామ్ సింగరాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలు. బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే శ్యామ్‌సింగరాయ్ కథ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.