
Shyam Singha Roy: నెట్‌ఫ్లిక్స్‌లో ‘శ్యామ్ సింగ రాయ్’.. స్ట్రీమింగ్ అప్పట్నుంచే!
ఇంటర్నెట్ డెస్క్: ‘క్రిస్మస్ మనదే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబర్ 24న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా అని ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్. జనవరి నాలుగో వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం ప్రసారం కానుందని సమాచారం. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ట్రీమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో పునర్జన్మల ఆధారంగా శ్యామ్, వాసు పాత్రల్లో నటించారు నాని. దేవదాసిగా సాయిపల్లవి, కీర్తి పాత్రలో కృతిశెట్టి కనిపించారు. 1970ల్లో బెంగాల్ నేపథ్యం, వర్తమాన్ని కలిపి వచ్చిన ఫిక్షనల్ కథకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఆఖరి రెండు పాటలు ఈ చిత్రంలోనివే కావడం మరో విశేషం. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.