Siddharth: కోస్టార్‌తో సిద్ధార్థ్‌ ప్రేమాయణం అంటూ వార్తలు.. ఫొటో షేర్‌ చేసిన నటుడు

‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి కుటుంబ కథా చిత్రాలతో తెలుగువారికి చేరువైన నటుడు సిద్ధార్థ్‌ (Siddarth). అతడు ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.

Published : 30 Oct 2022 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన సహనటి అదితిరావు హైదరీ (Aditi Rao)తో నటుడు సిద్ధార్థ్‌ (Siddharth) ప్రేమలో ఉన్నారంటూ కొంత కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. పలు పార్టీల్లో వీళ్లిద్దరూ కలిసి పాల్గొన్నఫొటోలు బయటకు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్‌.. ఆమె ఫొటోని షేర్‌ చేయడం ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది.

కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ్‌..  ఇటీవల కాలంలో ‘మహాసముద్రం’తో ముందుకువచ్చాడు. ఇంటెన్స్‌ ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో అతడికి జోడీగా అదితిరావు హైదరీ నటించింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ తర్వాత వీరిద్దరూ ముంబయిలోని రెస్టారెంట్స్‌ వద్ద సందడి చేశారు. దీంతో వీళ్లు ప్రేమలో ఉన్నారని ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా, అదితి పుట్టినరోజు పురస్కరించుకుని ఆమెతో దిగిన ఓ ఫొటోని సిద్ధార్థ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ‘‘హృదయ యువరాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నీ ప్రతి కల నెరవేరాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో దీనిని చూసిన నెటిజన్లు.. ‘చూడచక్కనైన జోడీ. నిజంగానే ప్రేమలో ఉన్నారా?’ అంటూ తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు