Siddharth: ‘టక్కర్’తో నా కల నెరవేరింది.. ఆయనకు రుణపడి ఉంటా: సిద్ధార్థ్
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా దర్శకుడు కార్తీక్ జీ తెరకెక్కించిన చిత్రం.. ‘టక్కర్’. ఈ సినిమా ఈ నెల 9న విడుదలకానున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్యంలో నటించాలనే తన కల ‘టక్కర్’ (Takkar) సినిమాతో నెరవేరిందని హీరో సిద్ధార్థ్ (Siddharth) తెలిపారు. ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఆయన హీరోగా దర్శకుడు కార్తీక్ జీ తెరకెక్కించిన చిత్రమిది. దివ్యాంశ కౌశిక్ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో వేడుకను నిర్వహించింది. నిర్మాత సురేశ్‌బాబు, దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్, వెంకటేశ్ మహా, తరుణ్ భాస్కర్ తదితరులు అతిథులుగా హాజరై ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
వేడుకనుద్దేశించి సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘‘మంచి యాక్షన్ ఫిల్మ్ ఇది. యాక్షన్‌లో ఓ లవ్‌స్టోరీని యాడ్ చేశారు మా దర్శకుడు. ఇప్పటివరకు మీరు సిద్ధార్థ్‌ని సాఫ్ట్ లవర్‌గానే చూశారు. ఈ చిత్రంలో లవర్‌బాయ్ రగడ్‌గా కనిపిస్తాడు. దాన్ని చూడటానికి మీరంతా తప్పకుండా థియేటర్‌కు రావాలి. పూర్తిస్థాయి యాక్షన్ చేయాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది. యుక్త వయసులోనే లెజెండ్స్‌తో కలిసి పనిచేయడం దేవుడు నాకిచ్చిన వరంగా భావిస్తున్నా. ప్రముఖ నిర్మాత రామానాయుడు గారు నాకిచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయనకు రుణపడి ఉంటాను. ‘సురేశ్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌లో ఎప్పుడు సినిమా చేస్తావని ఆయన అడిగేవారు. నేను ఆ బ్యానర్‌లో నటించినా, నటించికపోయినా దాని ప్రభావం నాపై ఎప్పుడూ ఉంటుందని చెబుతుండేవాణ్ని. ఆయన తనయులు సురేశ్‌బాబు, వెంకటేశ్ గారి ప్రోత్సాహం నేను ఎప్పటికీ మరువలేను’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌పై వేటు
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!