DJ Tillu: విజయ్‌, అడవి శేష్‌లా నాకు అవకాశం రాలేదు: సిద్ధు జొన్నలగడ్డ

సిద్ధు జొన్నలగడ్డ.. ‘డీజే టిల్లు’ చిత్రం హిట్‌ కొట్టడంతో టాలీవుడ్‌లో ఈ పేరు తెగ వినిపిస్తోంది. ఎక్కడా చూసినా ‘డీజే టిల్లు’ పాటలు మారుమ్రోగిపోతున్నాయి. అయితే, అతడికి అంత సులువుగా ఈ పాపులారిటీ దక్కలేదు.  ‘గుంటూరు టాకీస్‌’ చిత్రంతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు.. ఆ తర్వాత అడపాదడపా

Updated : 18 Feb 2022 10:10 IST

హైదరాబాద్‌: సిద్ధు జొన్నలగడ్డ.. ‘డీజే టిల్లు’ చిత్రం హిట్‌ కావడంతో టాలీవుడ్‌లో ఈ పేరు తెగ వినిపిస్తోంది. ఎక్కడా చూసినా ‘డీజే టిల్లు’ పాటలు మారుమోగిపోతున్నాయి. అయితే, అతడికి అంత సులువుగా ఈ పాపులారిటీ దక్కలేదు. ‘గుంటూరు టాకీస్‌’ చిత్రంతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు.. ఆ తర్వాత అడపాదడపా పాత్రలు చేసుకుంటూ వచ్చాడు. ఆ మధ్య వచ్చిన ‘కృష్ణ అండ్‌ హీస్‌ లీలా’, ‘మా వింతగాథ వినుమా’ చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. ఎట్టకేలకు ‘డీజే టిల్లు’తో సిద్ధుకి హిట్‌తోపాటు మంచి గుర్తింపు లభించింది. అయితే, తను హీరోగా నటించిన అన్ని చిత్రాలకి కథ, మాటలు సిద్ధునే రాసుకోవడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘డీజే టిల్లు’ విజయం సాధించడం పట్ల సిద్ధు స్పందించాడు. 

‘‘ఈ రోజు పెన్ను పవర్‌ గెలిచింది. మిమ్మల్ని నవ్వించడానికి చాలా కష్టపడ్డాం. ఈ విజయం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. అప్పట్లో ‘గుంటూరు టాకీస్‌’ చిత్రం విడుదలై హిట్‌ సాధించింది. కానీ, అప్పుడు నాకు ‘పెళ్లి చూపులు’ తర్వాత విజయ్‌ దేవరకొండకు, ‘క్షణం’ తర్వాత అడవి శేష్‌కు వచ్చినట్లు గొప్ప అవకాశాలు రాలేదు. అందుకే, ఇంత గ్యాప్‌ వచ్చింది. ఓ సారి నా ఫ్రెండ్‌ను నా కోసం ప్రచారం చేయమన్నా. కానీ, అది జరగలేదు. అప్పుడే నిర్ణయించుకున్నా ఎవరూ మనల్ని పట్టించుకోనప్పుడు మనమే ఒక సంచలనంగా మారాలి అని. అలా అనుకొని తీసిన గత రెండు చిత్రాలకు మిశ్రమ స్పందన వచ్చినా.. ‘డీజే టిల్లు’ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది’’ అని సిద్ధు చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ఆడుతున్న ఈ చిత్రానికి విమల్‌కృష్ణ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రంలో సిద్ధుకి జంటగా నేహాశెట్టి నటించారు. ప్రిన్స్‌, బ్రహ్మాజీ, ప్రగతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ చరణ్‌ పాకాల స్వరాలు సమకూర్చగా తమన్‌ నేపథ్యం సంగీతం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని