Siddhu: ఆ విషయంలో విచారానికి లోనయ్యా: సిద్ధూ జొన్నలగడ్డ

వరుస రొమాంటిక్‌, ప్రేమకథా చిత్రాలతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు నటుడు సిద్ధూ జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటించిన సరికొత్త ఎంటర్‌టైనర్‌....

Published : 05 Feb 2022 02:26 IST

హైదరాబాద్‌: వరుస రొమాంటిక్‌, ప్రేమకథా చిత్రాలతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు నటుడు సిద్ధూ జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటించిన సరికొత్త ఎంటర్‌టైనర్‌ ‘డీజే టిల్లు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో ట్రైలర్‌లో ఉన్న సన్నివేశాన్ని ఆధారంగా చేసుకొని.. ‘‘సినిమాలో చూపించినట్టు.. రియల్‌ లైఫ్‌లో హీరోయిన్‌కి ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా’’ అని ఓ విలేకరి సిద్ధూని ప్రశ్నించడం.. దానిపై నేహాశెట్టి సోషల్‌మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఈ ఘటనపై తాజాగా సిద్ధూ కూడా స్పందించారు. తాను విచారానికి గురైనట్లు చెప్పారు. ‘‘ఒక విషయం నన్ను ఎంతో బాధకు గురిచేసింది. దాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ‘డీజే టిల్లు’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఓ అభ్యంతరకరమైన ప్రశ్న నేను ఎదుర్కొన్నాను.  ఎదుటివారిపై ఉన్న గౌరవంతో నా టెంపర్‌ కోల్పోకుండా.. కావాలనే ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోయాను. ఈ ఘటనతో నటీనటుల పట్ల కొంతమందికి ఎలాంటి అభిప్రాయం ఉందనేది అర్థమైపోతుంది. నటీనటులు కష్టపడి పనిచేస్తారు. రొమాంటిక్‌ సన్నివేశాలు చేసేటప్పుడు ఎంతో ఇబ్బందిపడుతుంటారు. ముఖ్యంగా కథానాయికలు. సెట్‌లో ఉండే వారందరి ఎదుట తన కోస్టార్‌ని ఓ హీరోయిన్‌ ముద్దు పెట్టుకోవడం సులభమైన విషయం కాదు. దానికి ఎంతో ధైర్యం కావాలి. కాబట్టి నటీనటులందరి తరఫున నేను కోరేది ఒక్కటే.. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి, మీకు సంతోషాన్ని అందించడానికి మేము ఉన్నాం. కానీ, సినిమాల్లో మేము చేసే పాత్రల్ని ఆధారంగా చేసుకుని మా జీవితాలను జడ్జ్‌ చేయకండి. ఈ ఘటనను ఇంతటితో వదిలేసి.. ఇకపై మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అని సిద్ధూ పోస్ట్‌ పెట్టారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts