Tillu2: స్టార్ బాయ్ వచ్చేస్తున్నాడు.. ‘డీజే టిల్లు 2’ రిలీజ్ ఎప్పుడంటే..
సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘టిల్లు స్వ్కేర్’ (Tillu Square). తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది.
హైదరాబాద్: ‘డీజే టిల్లు’ (DJ Tillu).. గతేడాది విడుదలైన ఈ చిత్రం అంచనాలకు మించి విజయం సాధించింది. అంత క్రేజ్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సీక్వెల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా ‘టిల్లు స్వ్కేర్’ (Tillu Square) రూపొందుతోంది. గతేడాది దీపావళికి ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి ఈ స్టార్ బాయ్ సందడి చేస్తూనే ఉన్నాడు. ఇక థియేటర్లో సందడి చేసేందుకు సెప్టెంబర్ 15న రానున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ట్వీట్ చేసింది. మొదటి భాగానికి మించి వినోదాన్ని పంచనుందని పేర్కొంటూ ఒక రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేసింది. రామ్ మల్లిక్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఈ యంగ్ హీరో సరసన కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటిస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో రాధిక పాత్ర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. దీంతో రెండో భాగంలో అంత క్రేజీ పాత్రలో అనుపమ నటిస్తుండడంతో యూత్ అంత ఆసక్తిగా ఉన్నారు. చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుపమ లుక్‌ను విడుదల చేయాలని కోరుతున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇక త్వరలోనే సిద్ధు స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి నటించనున్నాడనే వార్తలు వస్తున్నాయి. నందినిరెడ్డి దర్శకత్వంలో రానున్న ఓ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో 30 టన్నుల వ్యర్థాల తొలగింపు..!
-
KTR: కర్ణాటకలో కాంగ్రెస్ ‘రాజకీయ ఎన్నికల పన్ను’: మంత్రి కేటీఆర్
-
Rohit Shama: సిక్సర్లందు రోహిత్ సిక్సర్లు వేరయా!
-
World Culture Festival : ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం ఎంతో ముఖ్యం : జైశంకర్
-
Nara Lokesh: 2 రోజులుకే ఆ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయ్: నారా లోకేశ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు