Kiara Advani: కియారా పరిణయం

బాలీవుడ్‌ కథానాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra), కథానాయిక కియారా అడ్వాణీ (Kiara Advani) వివాహబంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం జైసల్మేర్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది.

Updated : 08 Feb 2023 10:39 IST

బాలీవుడ్‌ కథానాయకుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra), కథానాయిక కియారా అడ్వాణీ (Kiara Advani) వివాహబంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం జైసల్మేర్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ మీడియా ఎప్పుడు అడిగినా...‘అలాంటిది ఏమీ లేదు. మేం మంచి స్నేహితులం’’అనే చెప్పేవారు. ఈ ఇద్దరూ కలసి ‘షేరా’్ష చిత్రంలో నటించారు. కియారా తెలుగులో ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌-శంకర్‌ కలయికలో వస్తోన్న చిత్రంలో నటిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని