Koffee With Karan: కియారాని పెళ్లి చేసుకుంటావా.. సిద్ధార్థ్ మల్హోత్ర ఏమన్నారంటే?
కాఫీ విత్ కరణ్ షోలో సిద్ధార్థ్ మల్హోత్ర.. కిరాయా అడ్వాణీ గురించి సంగతులు.. ఈ షోలో ఆయనతోపాటు విక్కీ కౌశల్ సందడి చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటులు కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్ర (Sidharth Malhotra) ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ‘షేర్షా’లో కలిసి నటించిన ఈ జంట.. వివాహం బంధంతో త్వరలోనే ఒక్కటి కాబోతున్నారనే వార్తలూ బాలీవుడ్ మీడియాలో వెలువడ్డాయి. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 7’ (Koffee with Karan) కార్యక్రమంలో దర్శక-నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) దీనికి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. ఆ విశేషాలివీ.. ఈ షో 7వ ఎపిసోడ్‌కి అతిథులుగా సిద్ధార్థ్, విక్కీ కౌశల్ (Vicky Kaushal) హాజరయ్యారు. వారు చేసిన సందడికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘ఇద్దరూ పంజాబీ బాయ్స్’ అని కరణ్ అనగానే ‘అందుకే ఇది పంజాబీ ఎపిసోడ్’ అంటూ విక్కీ వినోదం పంచారు. ‘ప్రస్తుతం నువ్వు కియారాతో డేటింగ్ చేస్తున్నావ్. భవిష్యత్తులో ప్లాన్స్ ఏంటి? ఆమెను పెళ్లి చేసుకుంటావా?’ అని కరణ్ ప్రశ్నించగా.. తనకు ఏం అర్థంకాలేదన్నట్లుగా ‘సారీ’ అంటూ సమాధానాన్ని దాట వేశారు సిద్ధార్థ్. అనంతరం, ‘టాయ్‌లెట్’, ‘అమెరికా’, ‘బనానా’ అనే వాటిని పంజాబీలో ఎలా పలుకుతారో చూపిస్తూ సిద్ధార్థ్, విక్కీ అలరించారు.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’తో నటుడిగా మారిన సిద్ధార్థ్ మల్హోత్ర ‘ఏక్ విలన్’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘బార్ బార్ దేఖో’, ‘మర్జావాన్’ తదితర చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ‘మసాన్’, ‘రాజీ’, ‘సంజు’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘సర్దార్ ఉద్దమ్’ తదితర విభిన్న కథా చిత్రాలతో మెప్పించిన విక్కీ కౌశల్ కథానాయిక కత్రినా కైఫ్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై 6 సీజన్లు పూర్తి చేసుకున్న ‘కాఫీ విత్ కరణ్’ షో తాజా సీజన్ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar) వేదికగా సందడి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు