Sidharth Malhotra: సిద్ధార్థ్ ‘బోల్డ్ అనౌన్స్‌మెంట్’.. ఆయన చెప్పబోయేది దాని గురించేనా?
‘బోల్డ్ అనౌన్స్‌మెంట్ రేపు రాబోతోంది’ అని బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర ఆదివారం ఓ పోస్ట్ పెట్టారు. దానిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేందుకు పలువురు నటులు ఏ విషయాన్నీ నేరుగా చెప్పరు. సృజనాత్మకతను ప్రదర్శిస్తుంటారు. దాంతో, నటులు ఇచ్చిన హింట్‌ను ఒక్కొక్కరూ ఒక్కోలా అర్థం చేసుకుంటారు. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర (Sidharth Malhotra) తాజా పోస్ట్‌పై ఇదే వ్యవహారం నడుస్తోంది. ‘రేపు బోల్డ్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది’ అని ఆయన ఆదివారం ఓ పోస్ట్ పెట్టారు. దాన్ని చూసిన నెటిజన్లలో కొందరు ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. కొందరు సినిమా ప్రకటన అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఇప్పటికే రణ్‌వీర్‌సింగ్ బోల్డ్‌గా కనిపించారు. మీరు అలా చేయకండి’ అంటూ ఒకరు వ్యంగ్యంగా స్పందించారు. మరి, సిద్ధార్థ్ ఏం చెబుతారో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
నటి కియారా అడ్వాణీతో సిద్ధార్థ్ ప్రేమలో ఉన్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. పలు టెలివిజన్ కార్యక్రమాల్లోనూ ఈ ఇద్దరికీ పెళ్లిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే, వారు సమాధానాన్ని దాట వేసేవారు. సిద్ధార్థ్ ఇప్పుడు ‘ప్రకటన’ అని అనడంతో అత్యధికమంది మ్యారేజ్ గురించే అని ఫిక్స్ అయిపోయారు. సిద్ధార్థ్ ఈ ఏడాది ‘మిషన్ మజ్ను’ (Mission Majnu) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో విడుదలైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వింత ఘటన.. ఉల్లి కోసేందుకు వెళితే కళ్లలోంచి కీటకాల ధార
-
Ap-top-news News
Andhra News: ఈ వృద్ధుడు.. మృత్యుంజయుడు
-
Ap-top-news News
Vande Bharat Express: సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ షెడ్యూల్ ఇదే..
-
Crime News
Suresh Raina: సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్కౌంటర్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్