Simbu: ‘ముత్తు’గా శింబు.. పవర్‌ఫుల్‌ చిత్రం విడుదల ఆరోజే

శింబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు వాసుదేవ్‌ మేనన్‌ రూపొందించిన తమిళ చిత్రం ‘వెందు తనిందతు కాడు’.

Published : 09 Sep 2022 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శింబు (Silambarasan) ప్రధాన పాత్రలో దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ రూపొందించిన తమిళ చిత్రం ‘వెందు తనిందతు కాడు’ (Vendhu Thanindhathu Kaadu). సిద్ధి ఇద్నాని కథానాయిక. రాధిక కీలక పాత్ర పోషించారు. శ్రీ స్రవంతి మూవీస్‌ సంస్థ.. ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ (The Life of Muthu) పేరుతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సదరు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా టైటిల్‌ పోస్టర్‌ను పంచుకుంది. లుంగీ ధరించి, గ్రామీణ యువకుడి పాత్రలో అమాయకంగా కనిపించారు శింబు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథతో తెరకెక్కినట్టు, శింబు ద్విపాత్రాభినయం చేసినట్టు ఇటీవల విడుదలైన తమిళ ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకి ఎ. ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. గౌతమ్‌- శింబు- రెహమాన్‌ కాంబినేషన్‌లో గతంలో తెరకెక్కిన క్లాసిక్‌ ప్రేమకథ ‘విన్నైతాండి వరువాయా’ (ఏమాయ చేశావే) సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాంతో, ఈ కొత్త చిత్రంపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని