సినిమా సూపర్‌హిట్‌.. స్టార్‌ హీరోకి లగ్జరీ కారు గిఫ్ట్‌

శింబు (Simbu) హీరోగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘వెందు తానింధాతు కాదు’. గౌతమ్‌ మేనన్‌ దర్శకుడు. సుమారు పదిరోజుల క్రితం ప్రేక్షకుల...

Published : 25 Sep 2022 15:43 IST

హైదరాబాద్‌: శింబు (Simbu) హీరోగా తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘వెందు తానింధాతు కాదు’. గౌతమ్‌ మేనన్‌ దర్శకుడు. సుమారు పదిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా పాజిటివ్‌ టాక్‌తో విజయాన్ని అందుకుంది. గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో శింబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ తాజాగా సక్సెస్‌ పార్టీ ఏర్పాటు చేసింది. తమ బ్యానర్‌కు హిట్‌ అందించిన దర్శకుడు గౌతమ్‌ మేనన్‌కు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. శింబుకు లగ్జరీ కారును బహుమతిగా నిర్మాత ఇషారి కె.గణేశ్‌ అందించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది.

‘మానాడు’ సక్సెస్‌ తర్వాత శింబు నటించిన చిత్రమిది. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ముత్తువీరన్‌ అనే స్టూడెంట్‌.. ముంబయికి ఎలా వెళ్లాడు?తల్లితోపాటు కుటుంబాన్ని పోషించేందుకు ఎలా ఇబ్బందులు పడ్డాడు? ముత్తు గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి దారి తీసిన కారణాలేమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైంది. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ పేరుతో విడుదల చేశారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని