Singer Chinmayi: కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) తల్లయ్యారు. చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు మంగళవారం రాత్రి ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్ర (Rahul Ravidran) సోషల్‌మీడియాలో.....
హైదరాబాద్: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) తల్లయ్యారు. చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు మంగళవారం రాత్రి ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravidran) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిన్నారుల చేతులను ఫొటో తీసి, దాన్ని నెట్టింట షేర్ చేసిన ఆయన.. ‘‘దృప్త, శర్వస్... మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు’’ అని రాసుకొచ్చారు. రాహుల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒకే పరిశ్రమలో వేర్వేరు విభాగాలకు చెందిన ఈ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ వల్ల పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడిన వీరు.. తమ బంధం గురించి ఇరు కుటుంబాల్లో చెప్పి.. పెద్దల అంగీకారంతో 2014లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
‘అందాల రాక్షసి’ (Andala Rakshasi) చిత్రంతో తెలుగువారికి చేరువయ్యారు నటుడు రాహుల్. ఫీల్‌గుడ్ ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ని అందుకుంది. రాహుల్.. కేవలం హీరోగానే కాకుండా సహాయనటుడిగానూ అలరించారు. ఇటీవల విడుదలైన ‘శ్యామ్‌సింగరాయ్’ (Shyam Singha Roy)లో రాహుల్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం సొంతం చేసుకున్నారాయన. ఇక, చెన్నైకు చెందిన చిన్మయి కోలీవుడ్, టాలీవుడ్‌లలో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు మధురమైన పాటలు ఆలపించారు. ముఖ్యంగా నటి సమంతకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఆమె వ్యవహరించారు. సామ్ నటించిన పలు చిత్రాల్లో చిన్మయి లవ్లీ సాంగ్స్ ఆలపించారు. ‘బాయ్స్’, ‘శివాజీ’, ‘ఆరెంజ్’, ‘ఏ మాయ చేశావే’, ‘ఊసరవెల్లి’, ‘రంగం’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు’, ‘మజ్ను’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’, ‘మజిలీ’, ‘వరుడు కావలెను’ ‘మేజర్’, ‘96’ ఇలా ఎన్నో సినిమాలు ఆమెకు గాయనిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్‌ఖాన్‌తో మోహన్‌లాల్
మోహన్‌లాల్ డ్యాన్స్‌ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్‌పై మోహన్‌లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్‌కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
మాధురి దీక్షిత్‌తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్‌లో తన కెరీర్‌కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్‌ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!