Singer Damini: బయటకు వెళ్తే నా పరిస్థితేంటో అర్థం కావటం లేదు: దామిని

Damini interview: తన ప్రవర్తన ఆడియెన్స్‌కు నచ్చలేదేమోనని గాయని దామిని చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి బయటకు వచ్చిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Published : 25 Sep 2023 19:01 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి మూడో వారం గాయని దామిని భట్ల (Damini) ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. తన పాటలతో ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను అలరించిన దామిని ఇంకొన్ని రోజులు ఉంటుందని అందరూ అనుకున్నారు. ఆమె కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎలిమినేషన్‌ అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో దామిని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఏడెనిమిది వారాలు ఉంటాననుకున్నా!

‘‘ఇంత త్వరగా ఇంటి నుంచి బయటకు వస్తానని అస్సలు అనుకోలేదు. నన్ను నేను ఎక్కువ చూపించుకోలేదేమో. ఇంట్లో ఉన్న వాళ్లు నాకన్నా ఎక్కువసార్లు కెమెరాకు కనిపించి ఉంటారు. నేనెప్పుడైనా కెమెరా ముందుకు వస్తే పాట పాడటమో.. నా ఫీలింగ్స్‌ చెప్పటమో చేశా. అలాగని, అందరికీ కనపడాలనే ఉద్దేశంతో వంట చేయలేదు. పనిగట్టుకుని ఒకరి దగ్గరకు వెళ్లి మాట్లాడలేదు. నేను మూడో వారంలో ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చే కంటెస్టెంట్‌ను కాదని నా ఫీలింగ్‌. ఏడెనిమిది వారాలు ఉంటానని అనుకున్నా. నా వరకూ నేను చాలా చక్కగా ఆడాను. నామినేషన్స్‌ అప్పుడు అందరూ చిన్న చిన్న కారణాలు చెబితే, నేను సరైన కారణాలు చెప్పేదాన్ని. ప్రతిదీ పాయింట్‌ టు పాయింట్‌ మాట్లాడేదాన్ని’’

నా ప్రవర్తన ఆడియెన్స్‌కు నచ్చలేదేమో!

‘‘ఒకవేళ ఇప్పటికీ హౌస్‌లో ఉండి ఉంటే ఈ వారం టాస్క్‌లు ఇంకా బాగా ఆడేదాన్ని. బిగ్‌బాస్‌ (Bigg boss 7) హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా వంట చేసింది నేనే. హౌస్‌లో ఉన్నవాళ్లలో పనిదొంగలు ఉన్నారు. ఇక టాస్క్‌ల సమయంలో గెలవడానికి నా వంతు ప్రయత్నం చేశా. యావర్‌ పట్ల అలా వ్యవహరించింది కేవలం టాస్క్‌లో భాగంగా మాత్రమే. కావాలని అతడిని ఇబ్బంది పెట్టలేదు. ఇంటి సభ్యుల మధ్య నేను ఎలాంటి గొడవలు పెట్టలేదు. కేవలం ఒకరి సమాచారాన్ని మరిరొకరికి చేరవేశా. నా ప్రవర్తన ఆడియెన్స్‌కు నచ్చకపోతే నేనేమీ చేయలేను. ఎవరెవరిని నామినేట్‌ చేయాలో ముందుగానే అనుకుని, తగిన కారణాలు సిద్ధం చేసుకుంటా. ‘నా డ్రెస్‌ పాడైపోతుంది. అంట్లు తోమితే నా గోళ్లు విరిగిపోతాయి’ శుభశ్రీలా నేను ఎప్పుడూ పోజులు కొట్టలేదు. ఇన్ని నిజాలు చెప్పేశాను. నేను బయటకు వెళ్తే, నా పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. మిగిలిన వాళ్ల ఫ్యాన్స్‌ నన్ను ట్రోల్‌ చేస్తారేమో’’ అంటూ బిగ్‌బాస్‌-7లో తన జర్నీని వివరించింది దామిని. అలాగే హౌస్‌లో ఉన్నవాళ్లలో ఎవరెలాంటి వారో కూడా చెప్పింది.

 • రతిక: సగం సగం వింటుంది.
 • శుభశ్రీ: 24 గంటల డ్రెస్‌ సరిచేసుకుంటుంది. పని మాత్రం చేయదు.
 • ప్రియాంక: చాలా కష్టపడుతుంది. అయితే, సేఫ్‌ గేమ్‌ ఆడటం మానుకోవాలి.
 • శోభశెట్టి: మేకప్‌ వేసుకోనప్పుడు ఒక సగటు అమ్మాయిలా ఉంటుంది. మేకప్‌ వేసుకుంటే, ఆమె కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ మారిపోతాయి. అది నాకు బాగా నచ్చింది. ఇక తేజతో పనులు చేయించుకుంటుంది.
 • యావర్‌: అవతలి వ్యక్తి ఏం అడుగుతున్నాడో అర్థం చేసుకుని మాట్లాడితే బెటర్‌.
 • తేజ: వెటకారం తగ్గించుకోవాలి. పనిదొంగ. చాలా సరదాగా ఉంటాడు.
 • అమర్‌: చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. ప్రశాంత్‌ విషయంలోనే కాకుండా అందరితోనూ గట్టిగా మాట్లాడాలి.
 • గౌతమ్‌: అన్నీ తనకే తెలుసని అనుకుంటాడు.
 • సందీప్‌: స్వీట్‌ హార్ట్‌.
 • ప్రశాంత్‌: అతని గురించి మాట్లాడను. ఎవరికీ అర్థం కాడు. అతనికి అన్నీ తెలుసు. కానీ, అలా నటిస్తాడు.
 • శివాజీ: ఒకరు మనకు పనికొస్తారనుకుంటే వాళ్లతోనే ఉంటారు. చాలా కన్నింగ్‌ గేమ్‌ ఆడతారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని