
Lata Mangeshkar: నిలకడగా లత ఆరోగ్యం
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె సన్నిహితులు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం కరోనా సోకడంతో లత ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.‘‘లతాజీ ఆరోగ్యం బాగుంది. వైద్యులు సూచించాకా ఇంటికి తీసుకొస్తామ’’ని లతా మంగేష్కర్ సన్నిహితులైన అనూష శ్రీనివాసన్ అయ్యర్ బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. లత ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు అనూష.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.