Singer Revanth: వేడుకగా సింగర్‌ రేవంత్‌ వివాహం

తెలుగు సినీ గాయకుడు, ఇండియన్‌ ఐడిల్‌-9 విజేత రేవంత్‌ ఓ ఇంటి వాడయ్యారు. నగరానికి చెందిన అన్వితతో ఫిబ్రవరి 6న ఆయన వివాహం వేడుకగా జరిగింది....

Updated : 07 Feb 2022 14:34 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ గాయకుడు, ఇండియన్‌ ఐడిల్‌-9 విజేత రేవంత్‌ ఓ ఇంటి వాడయ్యారు. గుంటూరుకు చెందిన అన్వితతో ఫిబ్రవరి 6న ఆయన వివాహం వేడుకగా జరిగింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలోనే వీరి వివాహం గుంటూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. పలువురు గాయనీగాయకులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక, రేవంత్‌-అన్వితల నిశ్చితార్థం డిసెంబర్‌ 24న జరగ్గా.. ఆ ఫొటోలను రేవంత్‌ సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈటీవీలో ప్రసారమైన ‘సప్తస్వరాలు’లో మొదటిసారి రేవంత్‌ స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఆయన పలు తెలుగు మ్యూజిక్‌ రియాల్టీ షోల్లో పాల్గొని రన్నర్‌గా నిలిచారు. ఈ క్రమంలోనే పలు తెలుగు చిత్రాలకు ప్లే బ్యాక్‌ సింగర్‌గా వ్యవహరించారు. ‘బద్రినాథ్‌’లో ‘చిరంజీవ చిరంజీవ’, ‘దమ్ము’లో ‘రూలర్‌’, ‘బాహుబలి’లో ‘మనోహరి’, ‘అర్జున్‌ రెడ్డి’లో ‘తెలిసెనే’ వంటి పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదలైన ‘ఆచార్య’లోని ‘సానా కష్టం’ పాటను ఆలపించింది కూడా ఈయనే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని