Smita: బిగ్‌బాస్‌పై సింగర్ స్మిత కీలక వ్యాఖ్యలు
తెలుగు సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’పై (Bigg Boss) పాప్ సింగర్ స్మిత (Smita) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమం తనకు నచ్చదని అన్నారు....
పొరపాటున కూడా ఆ తప్పు చేయను
హైదరాబాద్: తెలుగు సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’పై (Bigg Boss) పాప్ సింగర్ స్మిత (Smita) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమం తనకు నచ్చదని అన్నారు. ‘‘బిగ్‌బాస్’ నాకస్సలు నచ్చని షో. ఒకవేళ నాకు ఆ షోలోకి వెళ్లే అవకాశం వస్తే పొరపాటున కూడా వెళ్లి తప్పు చేయను. అన్ని రోజులపాటు కుటుంబాన్ని వదిలి ఉండాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన వాళ్లు ఎవరైనా అక్కడి వెళ్తున్నారని తెలిస్తే ‘ఏం వచ్చింది మీకు?’ అని ప్రశ్నిస్తా. కొంతమంది మనుషులను ఒక చోట పెట్టి.. మీరు తన్నుకోండి మేము టీఆర్పీలు తెచ్చుకుంటాం అన్నట్టు ఉంటుంది అక్కడి పరిస్థితి. ఆ షోని చూడను. చూసినా అది నాకు అర్థం కాదు. నాకు ఇష్టమైన వాళ్లు ఆ షోకి వెళ్లారు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే వాళ్లనూ విమర్శించినట్లు అవుతుంది. అందువల్ల ఆ షో గురించి ఎక్కువగా మాట్లాడాలనుకోవడం లేదు’’ అని స్మిత అన్నారు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన స్మిత ఈ విధంగా స్పందించారు. డిసెంబర్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు చెప్పారు. సుమారు ఐదేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగానే ఇటీవల చిరంజీవి కలిశానని, ఆయన మంచి వ్యక్తి అని, ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఆమె చెప్పుకొచ్చారు. నాగార్జున, నాని, నరేశ్ కుటుంబాలతో తనకి మంచి అనుబంధం ఉందని స్మిత వెల్లడించారు. ఇక, నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్’ సీజన్ 6 ఆదివారం నుంచి మొదలైంది. 21 మంది సెలబ్రిటీలతో సుమారు 15 వారాలపాటు ఈ సీజన్ జరగనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Viveka murder Case: సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ
-
India News
IAF: వాయుసేనకు భారీ నష్టం.. ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు
-
Politics News
Yuvagalam: వైకాపా చేసేది సామాజిక అన్యాయమే: లోకేశ్
-
Politics News
MNM: కాంగ్రెస్‌లో విలీనమా.. అదేం లేదు: వెబ్సైట్ హ్యాక్ అయిందన్న కమల్ పార్టీ
-
Movies News
Ayali Review: రివ్యూ: అయలీ.. దేవత దర్శనం ఆ అమ్మాయిలకేనా?
-
Sports News
IND vs NZ: అదే మా కొంప ముంచింది..: హార్దిక్ పాండ్య