srirama chandra: సింగర్‌ అసహనం.. ఫ్లైట్‌ మిస్సయిందంటూ కేటీఆర్‌కు విజ్ఞప్తి..!

టాలీవుడ్‌ గాయకుడు శ్రీరామ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. ఓ రాజకీయ నాయకుడి కారణంగా ఫ్లైట్‌ మిస్సయినట్లు తెలిపారు.

Updated : 31 Jan 2023 18:39 IST

హైదరాబాద్‌: ఒక రాజకీయ నాయకుడు విమానాశ్రయానికి వచ్చిన కారణంగా తను ఫ్లైట్‌ మిస్సయ్యానని అసహనం వ్యక్తం చేశాడు సింగర్‌ శ్రీరామ చంద్ర(Srirama chandra ). ఆ పొలిటీషియన్‌ కోసం ఫ్లై ఓవర్‌ బ్లాక్‌ చేయడం వల్ల తనకు ఆలస్యం అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్వీట్‌ చేస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారు.

‘‘ఒక ఈవెంట్‌ కోసం నేను గోవా వెళ్లాల్సి ఉంది. విమానాశ్రయానికి బయలుదేరిన నాకు ఫ్లై ఓవర్‌ బ్లాక్‌ చేసినట్లు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఒక రాజకీయ నాయకుడి కోసం ఇలా ఫ్లై ఓవర్‌ను బ్లాక్‌ చేశారు. దీంతో చుట్టూ తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వాహనాల రద్దీ పెరిగి.. ట్రాఫిక్‌ ఆగిపోవడంతో నాకు ఆలస్యం అయింది. నేను గోవా వెళ్లాల్సిన ఫ్లైట్‌ మిస్సయింది. ఇప్పుడు మరొక విమానంలో గోవా చేరుకోవడం కష్టమైన పని. నాతో పాటు 15మంది ఈ కారణంగానే ఫ్లైట్ మిస్సయ్యారు. రాజకీయ నాయకుల కోసం ఇలా చేయడం వల్ల మాలాంటి సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. దయచేసి దీని గురించి ఆలోచించాలని నేను రిక్వెస్ట్‌ చేస్తున్నాను’’ అంటూ వీడియోను ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌(KTR)ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతోంది. ఈ విషయంలో నెటిజన్లు శ్రీరామ చంద్రకు మద్దతు ఇస్తున్నారు. ‘ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటున్నాయని’ ఒకరంటే.. ‘ఈ సమస్య ఎప్పటికీ తీరదు’ అని మరొకరు కామెంట్‌ చేశారు. ఇక ఇండియన్‌ ఐడల్‌ విజేతగా శ్రీరామ చంద్ర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గాయకుడిగానే కాకుండా అప్పుడప్పుడూ వెండితెరపైనా కనిపిస్తూ అలరిస్తుంటాడు. ఇటీవల ఓ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్‌ అయ్యారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని