లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించండి: సునీత

ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన సందర్భంగా అందరూ నిబంధనలు పాటించాలని గాయని సునీత కోరారు. మద్యం దుకాణాల వద్ద జనం గుమిగూడటం దురదృష్టకరమైన విషయమని ఆమె అన్నారు.  ప్రతిరోజు రాత్రి 8గంటలకు వచ్చి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా లైవ్‌లోకి వచ్చి ఆమె పాటలు ఆలపిస్తున్నారు.

Published : 11 May 2021 23:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన సందర్భంగా అందరూ నిబంధనలు పాటించాలని గాయని సునీత కోరారు. మద్యం దుకాణాల వద్ద జనం గుమిగూడటం దురదృష్టకరమైన విషయమని ఆమె అన్నారు.  ప్రతిరోజు రాత్రి 8 గంటలకు వచ్చి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా లైవ్‌లోకి వచ్చి ఆమె పాటలు ఆలపిస్తున్నారు. మంగళవారం కూడా ఆమె లైవ్‌లో అభిమానులు కోరిన పాటలు పాడి అలరించారు. నెటిజన్లు పెట్టే కామెంట్లు చదువుతూ వాటిపై స్పందించారు. కరోనా వేళ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో అందరూ మాస్క్ పెట్టుకోవడంతో పాటు శానిటైజర్‌ రాసుకోవాలని ఆమె సూచించారు. ఆమె ఇంకా ఏ పాటలు పాడారో వినేయండి ఇక్కడ..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని