Dhanush: ‘సార్‌’ టీజర్‌ వచ్చేసింది.. లెక్చరర్‌గా ధనుష్‌ ఎలా ఉన్నారంటే?

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం ‘సార్‌’. వెంకీ అట్లూరి  దర్శకుడు. సంయుక్త మేనన్‌ కథానాయిక.

Updated : 28 Jul 2022 18:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ (Dhanush) హీరోగా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం ‘సార్‌’ (SIR). వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకుడు. సంయుక్త మేనన్‌ కథానాయిక. ధనుష్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ధనుష్‌ లెక్చరర్‌గా కనిపించారు. ఆయన స్మార్ట్‌ లుక్‌, క్లాస్‌ డైలాగ్స్‌ టీజర్‌లో ప్రధానాకర్షణగా నిలిచాయి. విద్యా వ్యవస్థ నేపథ్యంలో యాక్షన్‌- డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. జి. వి. ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: యువరాజ్‌, కూర్పు: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరులో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts