bigg boss season 5: టాప్‌-5లో ఎలిమినేట్‌ అయిన మొదటి వ్యక్తి సిరి

బిగ్‌బాస్‌(bigg boss telugu 5) హౌస్‌ నుంచి సిరి(siri) హన్ముంతు బయటకు వచ్చింది. టాప్‌-5లో సిరి, మానస్‌, షణ్ముఖ్‌, శ్రీరామ్‌, సన్నీలు ఉండగా

Updated : 19 Dec 2021 20:25 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ (bigg boss telugu 5) హౌస్‌ నుంచి సిరి(siri) హన్ముంతు ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చింది. టాప్‌-5లో సిరి, మానస్‌, షణ్ముఖ్‌, శ్రీరామ్‌, సన్నీలు ఉండగా ఆదివారం జరిగిన ఫినాలేలో తొలిసారి హౌస్‌ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిగా సిరి నిలిచింది. అంతకుముందు ‘పుష్ప’ టీమ్‌ వచ్చి హౌస్‌లో సందడి చేసింది. దర్శకుడు సుకుమార్‌, కథానాయిక రష్మిక, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ‘పుష్ప’ గురించి చెప్పారు. అనంతరం రష్మిక, దేవిశ్రీ ఇద్దరూ హౌస్‌లో వెళ్లారు. టాప్‌-5 కంటెస్టెంట్‌లను పలు ప్రశ్నలు అడిగారు. ఐదుగురు కంటెస్టెంట్‌ల ఫొటోలతో ఉన్న డ్రోన్స్‌ వస్తాయని వాటిలో ఒకటి ఎగిరిపోతుందని ఆ డ్రోన్‌పై ఎవరి ఫొటో ఉంటే వారే హౌస్‌ నుంచి బయటకు వస్తారని తెలిపారు. అలా సిరి ఫొటో ఉన్న డ్రోన్‌ ఎగిరిపోగా, ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చింది.

అనంతరం వేదికపైకి వచ్చిన సిరి మాట్లాడుతూ.. ‘‘19మంది కంటెస్టెంట్‌లలో ఒకరిగా వచ్చిన నేను టాప్‌-5లో నిలవడం సంతోషంగా ఉంది. బిగ్‌బాస్‌ జర్నీ చాలా బాగుంది. చాలాసార్లు ఎమోషనల్‌ అయ్యా. ఏదైనా హౌస్‌లో నాకు నచ్చినట్టు నేను ఉన్నా. నా దృష్టిలో సీజన్‌-5 విన్నర్‌(షణ్ముఖ్)ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 15వారాలు నన్ను భరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు .మీరు లేనిదే నేను లేను’’ అని భావోద్వేగానికి గురైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని