Sirivennela: ‘సిరివెన్నెల’ చివరి గీతం.. ఫుల్‌ వీడియో వచ్చేసింది

ప్రముఖ గేయ రచయిత దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి గీతం ‘సిరివెన్నెల’.

Published : 18 Jan 2022 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దివంగత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆఖరి గీతం ‘సిరివెన్నెల’. నాని హీరోగా తెరకెక్కిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలోని గీతమిది. అన్ని వర్గాల శ్రోతల్ని హత్తుకున్న ఈ పాట ఫుల్‌ వీడియో మంగళవారం విడుదలైంది. శ్యామ్‌ సింగరాయ్‌గా నాని, దేవదాసిగా సాయి పల్లవి నటన, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మిక్కీ జె. మేయర్‌ స్వరాలందించిన ఈ గీతాన్ని అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ చిత్రాన్ని కోల్‌కతా నేపథ్యంలో దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కించారు. నాని రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. అభినవ్‌ గోమటం, మడోన్నా సెబాస్టియన్‌ కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలో విడుదలై మంచి విజయం అందుకుంది. జనవరి 21 నుంచి ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని