Sita Ramam: యుద్ధంతో ‘సీతారామం’

దుల్కర్‌ సల్మాన్‌ కథా నాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. మృణాళిని ఠాకూర్‌ కథానాయిక. ఇందులో ‘అఫ్రీన్‌’ అనే కీలక పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది.

Updated : 11 Apr 2022 09:13 IST

దుల్కర్‌ సల్మాన్‌ కథా నాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. మృణాళిని ఠాకూర్‌ కథానాయిక. ఇందులో ‘అఫ్రీన్‌’ అనే కీలక పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకుడు. అశ్వినీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మాతలు. ఈ సినిమాకి ‘సీతారామం’ అనే పేరుని ఖరారు చేశారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా టైటిల్‌ ప్రకటించారు. సీత పాత్రలో మృణాళిని, లెఫ్టినెంట్‌ రామ్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ ఈ చిత్రంలో కనిపించనున్నారు. దీన్ని తెలుగుతోపాటు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: వైష్ణవిరెడ్డి, ప్రొడక్షన్‌ డిజైన్‌: సునీల్‌ బాబు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని