Sita Ramam: యుద్ధంతో రాసిన ప్రేమ కథ.. ‘సీతారామం’ను ఇలా తెరకెక్కించారు

‘సీతారామం’ మేకింగ్‌ వీడియో. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది.

Published : 04 Aug 2022 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’ అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది ‘సీతారామం’ (Sita Ramam) చిత్ర బృందం. యుద్ధంతో ముడిపడిన ఆ ప్రేమ కథ ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లోనే తెలియనుంది. ఈ నేపథ్యంలోనే.. అసలు ఆ కథ ఎలా తెరకెక్కిందో తెలియజేసే వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఏ ఏ లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరించారో, ఎవరెవరు నటించారో ఈ మేకింగ్‌లో చూడొచ్చు. కశ్మీర్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఈ చిత్రంలో హైలెట్‌గా నిలిచేలా ఉన్నాయి. దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక. సుమంత్‌, రష్మిక, గౌతమ్‌ మేనన్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వప్న సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు