Updated : 25 Jun 2022 16:31 IST

Sita Ramam: ఇట్లు.. నీ భార్య సీతామహాలక్ష్మీ.. హృద్యంగా ‘సీతారామం’ టీజర్‌

హైదరాబాద్‌: తనకు వచ్చిన ఉత్తరాలను చూసి ‘సీతా.. ఎవరు నువ్వు?’ అంటూ ప్రశ్నిస్తున్నారు దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salmaan). ఆయన కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ‘సీతా రామం’(Sita Ramam). యుద్ధంతో రాసిన ప్రేమకథ అనేది ట్యాగ్‌లైన్‌. మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) కథానాయిక. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను శనివారం విడుదల చేశారు. 

‘ఆకాశవాణి. ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం.. లెఫ్టినెంట్‌ రామ్‌ నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ అంటూ సీత సంభాషణలతో మొదలైన టీజర్‌ ఆద్యంతం హృద్యంగా సాగింది. 1965 నాటి కాలంలో సాగే కథతో ఈ హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక, సుమంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.  వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌ ‘సీతారామం’ను నిర్మిస్తున్నాయి. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీత దర్శకుడు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని