Published : 06 May 2022 20:35 IST

Sita Ramam: మనసులు దోచేందుకు సిద్ధమైన ‘సీతా రామం’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన హీరో దుల్కర్‌ సల్మాన్‌. మలయాళం హీరో అయినప్పటికీ తన నటనతో తెలుగులోనూ చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా స్వప్న సినిమా పతాకంపై ఈ యంగ్‌ హీరో నటిస్తున్న చిత్రం ‘సీతా రామం’. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ను మే9న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని దుల్కర్‌ తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘సీతా రామం మీ మనసులను దోచుకోవడానికి సిద్ధమయ్యారు’ అంటూ ట్వీట్‌ చేశారు. రష్మిక కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్‌ సరసన మృణాళిని ఠాకూర్‌ నటిస్తున్నారు. అశ్వినీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రేమకథా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌లు తదితరులు నటిస్తున్న ఈ ‘యుద్ధంతో’ రాసిన ప్రేమకథను తెలుగుతో పాటు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. పి.ఎస్‌.వినోద్‌ ఛాయాగ్రహణం బాధ్యతలు చేప్పటిన ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని