Vimanam: ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం.. ఇలాంటి చిత్రాలు అరుదు: శివ బాలాజీ
‘విమానం’లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయని నటుడు శివ బాలాజీ అన్నారు. ఆ సినిమా ప్రెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: సముద్రఖని, మీరా జాస్మిన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, మాస్టర్ ధ్రువన్ కలిసి నటించిన చిత్రం.. ‘విమానం’ (Vimanam). శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం.. ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు నటుడు శివ బాలాజీ (Siva Balaji), దర్శకుడు అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇప్పటికే ఈ సినిమాని చూసిన శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం. సినిమా నచ్చకపోతే ఆడిటోరియం వెనుక నుంచి పారిపోతుంటా. ఒకవేళ బలవంతంగా చూసినా.. మీడియా ముందుకొచ్చి, మాట్లాడుతుంటే ఆ చిత్రం ఎలా ఉందో నా ముఖంలోనే కనిపిస్తుంది. నేను అబద్ధం చెబుతున్నానని తెలిసిపోతుంది. ఈ సినిమాని చూడమని ధన్‌రాజు నన్ను ఆహ్వానించాడు. కొన్ని సినిమాలు చూసినప్పుడు భావోద్వేగానికి గురవుతాం. అది ఎలా ఉందని ఎవరైనా అడిగితే ‘బాగుంది’ అని మాత్రమే అంటాం. అంతకు మించి ఏం మాట్లాడలేం. ఈ సినిమా విషయంలో నాకు అలాంటి ఫీలింగే కలిగింది. ఆ కథకు నేను ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యా. ఈ చిత్రంలోని తండ్రి, కొడుకుల అనుబంధం మనసుని పిండేసింది. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..
-
Tamil Nadu : తమిళనాడులో అవయవదాత మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు