Prince: అఫ్గానిస్థాన్‌, కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లలో రిలీజ్‌ చేద్దామనుకున్నాం.. కానీ

‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌(Anudeep KV) దర్శకత్వంలో తమిళ నటుడు శివకార్తికేయన్‌(Sivakarthikeyan) హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది.

Updated : 21 Jun 2022 14:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌ (Anudeep KV) దర్శకత్వంలో తమిళ నటుడు శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ‘ప్రిన్స్‌’ (Prince) పేరుతో  తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడింది. తొలుత ఈ సినిమాను ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్తికేయన్‌ సరసన ఉక్రెయిన్‌ నటి మరియా నటిస్తోంది. ఇప్పుడు దీపావళి కానుకగా ఈ సినిమాను తీసుకురానున్నారు. ఈ సందర్భంగా సినిమా విడుదల విషయాన్ని తెలియజేస్తూ, శివ కార్తికేయన్‌, అనుదీప్‌, సత్యరాజ్‌, మరియాలు కలిసి మాట్లాడుకునే ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశారు.

‘ప్రిన్స్‌’ ఎందుకు ఆలస్యమవుతోందని సత్యరాజ్‌ అడగ్గా,  అఫ్గానిస్థాన్‌, కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, అంటార్కటికాలలో విడుదల చేద్దామనుకున్నామంటూ అనుదీప్‌ చెబుతున్న వీడియో నవ్వులు పూయిస్తోంది.  సురేష్‌ ప్రొడక్షన్స్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌, శాంతి టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అనుదీప్‌ ఈమూవీని తీర్చిదిద్దారు. ‘డాక్టర్‌’, ‘డాన్‌’ తదితర అనువాద చిత్రాలతో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు శివ కార్తికేయన్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని