ఆ హీరోతో నాకో డీల్‌ ఉంది: రకుల్‌

కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరోతో తనకు ఒప్పందం కుదిరిందని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. తెలుగు, తమిళ, బాలీవుడ్‌లలో వరుస చిత్రీకరణలతో బిజీగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సినిమాల గురించి మాట్లాడారు. ‘అయలాన్‌‌’ చిత్రం గురించి స్పందిస్తూ..

Published : 23 Jan 2021 01:52 IST

ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన నటి

హైదరాబాద్‌: కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరోతో తనకు ఒప్పందం కుదిరిందని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. తెలుగు, తమిళ, బాలీవుడ్‌లలో వరుస చిత్రీకరణలతో బిజీగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సినిమాల గురించి మాట్లాడారు. ‘అయలాన్‌‌’ చిత్రం గురించి స్పందిస్తూ.. ఆ సినిమా హీరో శివ కార్తికేయతో తనకు ఓ ఒప్పందం ఉందని రకుల్‌ అన్నారు.

‘కొవిడ్‌-19 కారణంగా గతేడాది షూట్స్‌ అన్నీ నిలిచిపోవడంతో ‘అయలాన్‌’ చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం శివకార్తికేయన్‌తో కలిసి నటించడాన్ని నేను బాగా ఎంజాయ్‌ చేశా. శివ.. చాలా మంచి సహనటుడు. చెన్నైలో నాకు కావాల్సిన ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పేవారు. డైలాగ్స్‌ విషయంలో నాకెంతో సాయం చేసేవారు. అలాగే ఆయన సెట్‌లో ఎంతో సరదాగా ఉంటూ జోక్స్‌ వేసేవారు. చిత్రీకరణ ప్రారంభమైన కొన్నిరోజులకు మా ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అదేమిటంటే.. సెట్‌లో ఉన్నంతసేపు ఆయన నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. అలాగే నేను ఆయనతో తమిళంలో సంభాషించాలి.’ అని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు.

ఇదీ చదవండి

ప్రభాస్‌.. ఇదస్సలు ఊహించలేదు: కృష్ణంరాజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని