Doctor trailer: శివకార్తికేయన్‌ ‘డాక్టర్‌’ ట్రైలర్‌.. వైద్యుడి చేతిలో తుపాకీ..!

శివ కార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’ చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. కాగా, శనివారం ఈ చిత్ర తమిళ ట్రైలర్‌ను విడుదల చేశారు.

Published : 26 Sep 2021 01:42 IST

హైదరాబాద్‌: తమిళంతో పాటు, తెలుగులోనూ అలరిస్తున్న నటుడు శివ కార్తికేయన్‌. ఆయన నటించిన పలు సినిమాలు అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నీల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ నటించిన తాజా మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘డాక్టర్‌’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా అక్టోబరు 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘వరుణ్‌ డాక్టర్‌’ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. కాగా, శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. వరుసగా జరుగుతున్న అమ్మాయిల కిడ్నాప్‌లను అడ్డుకునేందుకు ఓ డాక్టర్‌ ఏం చేశాడు? ఎవరెవరి సాయం తీసుకున్నాడు? చివరకు అమ్మాయిలను కిడ్నాప్‌ చేసే ముఠా ఆటకట్టించాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని