- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Cinema News: హిట్టు మాట...గట్టిగా గిట్టుబాట
ఆరు నెలల్లో బాక్సాఫీసు
చిత్రసీమలో ఎప్పుడూ విజయాల శాతం తక్కువే. నిర్మాత మొదలుకొని... ప్రదర్శన కారుడి వరకు అందరికీ లాభాలు తెచ్చిపెట్టే సినిమాలు కొన్నే. ఆ కాసిన్ని ఇచ్చే భరోసాతోనే పరిశ్రమ ముందుకు సాగుతుంటుంది. ఈసారీ అదే వరసే! ఎన్నో ఆశలు... మరెన్నో అంచనాల మధ్య మొదలైన 2022లో ఆరు నెలల కాలం గడిచిపోయింది. అనువాదాలతో కలుపుకొని మొత్తం 115 సినిమాలు విడుదలయ్యాయి. ఎప్పట్లాగే అప్పుడప్పుడే అయినా... ఈసారి హిట్టు మాట కాస్త గట్టిగా వినిపించింది. కొన్ని సినిమాలు బాక్సాఫీసు(Box Office) దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. మరికొన్ని ప్రారంభ వసూళ్లతో అదరగొట్టాయి. ‘ఆర్.ఆర్.ఆర్’(RRR) అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకర్షించింది. రూ.వందల కోట్లు రాబట్టిన సినిమాలతోపాటు... అంచనాలు అందుకోలేక చతికిలపడినవీ ఉన్నాయి. పరిమిత, మధ్యస్థ వ్యయంతో రూపొందినవి బాక్సాఫీసు దగ్గర ప్రభావం చూపించక పోవడం చిత్రసీమకి ఒకింత ఎదురుదెబ్బే.
ఎప్పుడూ సంక్రాంతి సినిమాలతోనే తెలుగు సినిమా బాక్సాఫీసు వేట మొదలు పెడుతుంటుంది. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో సంక్రాంతి సీజన్ సాగింది. నాగార్జున (Nagarjuna), నాగచైతన్య(NagaChaitanya) కథానాయకులుగా నటించిన ‘బంగార్రాజు’(Bangarraju) మినహా అగ్ర హీరోల సినిమాలేవీ విడుదల కాలేదు. ‘రౌడీబాయ్స్’(Rowdy Boys), ‘హీరో’(Hero) చిత్రాలొచ్చాయి. అవి యువతరాన్ని మాత్రం మెప్పించాయి. కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించలేకపోయాయి. ‘బంగార్రాజు’ పండగ సినిమాగా కనిపించి కాసిన్ని వసూళ్లని సొంతం చేసుకుంది. టికెట్ ధరలు, కరోనా భయాల మధ్య పెద్ద చిత్రాలు విడుదల కాలేకపోయాయి. దాంతో ఓ మంచి సీజన్ వృథా అయినట్టయింది. ఫిబ్రవరిలోనే బాక్సాఫీసు దగ్గర కాస్త సందడి కనిపించింది. ‘డీజే టిల్లు’(DJ Tillu) ప్రేక్షకుల్ని నవ్వించింది. పవన్‌కల్యాణ్ - రానాల ‘భీమ్లానాయక్’తో(Bheemla Nayak) థియేటర్ల దగ్గర క్యూ కనిపించింది.
వసూళ్లే వసూళ్లు
ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, భారీ అంచనాలున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR), ‘రాధేశ్యామ్’(Radheshyam) మార్చిలోనే విడుదలయ్యాయి. ప్రభాస్(Prabhas) కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన దీనికి ప్రారంభ వసూళ్లే దక్కాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అదరగొట్టింది. రాజమౌళి(Rajamouli) మార్క్ విజువల్స్, ఎన్టీఆర్(NTR) - రామ్‌చరణ్‌ల(RamCharan) నటన చిత్రాన్ని నిలబెట్టాయి. దీనికి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిసింది. థియేటర్లలోనే కాదు, కొన్నాళ్లుగా ఓటీటీ వేదికలో దీన్ని చూస్తున్న ప్రేక్షకులు ‘శభాష్.. భారతీయ సినిమా’ అని మెచ్చుకుంటున్నారు. ఏప్రిల్ మాసంలోనూ తెలుగురాష్ట్రాల్లోని బాక్సాఫీసులు కళకళలాడాయి. యశ్(Yash) కథానాయకుడిగా నటించిన ‘కేజీఎఫ్2’ (KGF2), తొలి చిత్రానికి దీటుగా ప్రేక్షకులకి చేరువైంది. ప్రశాంత్ నీల్(Prasanth Neel) మేకింగ్ మరోసారి ప్రేక్షకుల్ని అబ్బురపరిచింది. ‘ఆచార్య’తో(Acharya) ఆ పరంపర కొనసాగుతుందని ఆశించారంతా. ఇది మెప్పించలేకపోయింది.
సర్కారు... ఎఫ్3
మాస్ మసాలా సినిమాలకి పెట్టింది పేరు తెలుగు చిత్రసీమ. కొంతకాలంగా వాస్తవికతతో కూడిన సినిమాల జోరే కనిపిస్తోంది. ఆ ట్రెండ్‌ని బ్రేక్ చేస్తూ వచ్చారు మేనెలలో అగ్ర తారలు. మహేష్‌బాబు(MaheshBabu) ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata) ఫక్తు వాణిజ్యాంశాలతో తెరకెక్కింది. ప్రారంభ వసూళ్లతో కళకళలాడింది. ఈ నెలలోనే విడుదలైన వెంకటేష్(Venkatesh) - వరుణ్‌తేజ్(Varuntej) ‘ఎఫ్3’(F3) ప్రేక్షకుల్ని నవ్వించింది.
చిన్నవాటికి చుక్కెదురు
చిత్రసీమలో అగ్ర తారలు చేసే సినిమాలు పదుల సంఖ్యలోనే ఉంటాయి. మిగతా అన్నీ యువ హీరోలు, పరిమిత వ్యయంతో రూపొందే కొత్త నటుల చిత్రాలే ఉంటాయి. అవి థియేటర్లలో ఆడితేనే వసూళ్లు దక్కుతాయి. అవి సాధించే విజయాలు మరింత మంది నిర్మాతలకి స్ఫూర్తినిస్తాయి. ఏటా ఆ తరహా సినిమాలు చక్కటి ప్రభావం చూపించేవి. ‘డీజే టిల్లు’ తప్ప మిగతా వాటికి చుక్కెదురైంది. ఓటీటీ(OTT) మార్కెట్ పుణ్యమాని వాటి హక్కులు అమ్మగా వచ్చిన డబ్బుతో కొన్ని గట్టెక్కాయి. చాలా చిత్రాలు బాక్సాఫీసు దగ్గర ఘోర పరాభవాన్ని చవిచూశాయి. జూన్ నెలలోనే ‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki), ‘విరాటపర్వం’ (Virataparvam), ‘గాడ్సే’ (Godse), ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ (Gangster Gangaraju), ‘సమ్మతమే’(Sammathame) సహా 20 సినిమాలు విడుదలయ్యాయి. ‘అంటే సుందరానికి’, ‘విరాటపర్వం’ మెప్పించినా బాక్సాఫీసు దగ్గర ప్రభావం చూపించలేకపోయాయి. అడివి శేష్ ‘మేజర్’ (Major), కమల్‌హాసన్ ‘విక్రమ్’(Vikram) సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ రెండు చిత్రాలూ మంచి వసూళ్లతో అదరగొట్టాయి. విజయ్ ‘బీస్ట్’ (Beast), అజిత్ ‘వలిమై’ (Valimai), సూర్య ‘ఈటీ’ (ET), విశాల్ ‘సామాన్యుడు’, ‘డాన్’, అలియాభట్ ‘గంగూబాయి కాఠియావాడి’ వంటి అనువాద చిత్రాలు నామమాత్రంగానే ప్రభావం చూపించాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
SIIMA: సైమా 2022.. ఈ సారి పోటీ పడనున్న చిత్రాలివే
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
China: మా నౌక ఏ దేశ భద్రతకు ముప్పుకాదు: చైనా
-
Technology News
iPhone 14: యాపిల్ ఈవెంట్ జరిగేది అప్పుడేనా.. ఐఫోన్ 14తోపాటు ఇంకా ఏం విడుదలవుతాయ్?
-
India News
Jacqueline Fernandez: రూ.200కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలే..
-
Sports News
Ricky Ponting : టీమ్ఇండియా స్టార్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే ఉత్తమం: రికీ పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- TSRTC: హైదరాబాద్‌లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్‌కు మంచిది!
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?