SJ Surya: ఆ విషయాన్ని తట్టుకోలేకపోయా.. గుక్కపెట్టి ఏడ్చా: ‘ఖుషి’ డైరెక్టర్
నటుడు, దర్శకుడిగా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితులు ఎస్.జె.సూర్య (SJ Surya). ‘ఖుషి’కి దర్శకత్వం వహించిన ఆయన ‘స్పైడర్’లో విలన్‌గా కనిపించారు. ఇటీవల ఆయన నటించిన ‘మానాడు’ అంతటా మంచి స్పందన అందుకుంది.
చెన్నై: కెరీర్‌కు సంబంధించిన ఓ విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోనని ‘ఖుషి’ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య (SJ Surya) తెలిపారు. అగ్రహీరోతో తాను నటించిన ఓ ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయిందని, ఆనాడు తాను గుక్కపెట్టి ఏడ్చానని చెప్పారు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏమిటి? ఆ నటుడు ఎవరంటే..?
‘‘ఒక నటుడిగా వివిధ భాషలకు చెందిన సినీ పరిశ్రమల్లో పనిచేయాలని, నన్ను నేను నిరూపించుకోవాలని కలలు కన్నాను. అందుకు అనుగుణంగా అమితాబ్ బచ్చన్‌తో నటించే అవకాశం నన్ను వరించింది. మేమిద్దరం ప్రధాన పాత్రధారులుగా కోలీవుడ్‌లో ఓ సినిమా పట్టాలెక్కింది. సుమారు 10 రోజులపాటు షూట్ చేశాం. తీరా చూస్తే, సినిమా ఆగిపోయింది. ఆ విషయాన్ని నేను అంగీకరించలేకపోయాను. చిన్నపిల్లాడిలా కిందపడి గుక్కపెట్టి ఏడ్చాను. ఇప్పటికీ ఆ రోజులు మర్చిపోను. భగవంతుడు ఎందుకు నాకు ఇంతటి బాధను ఇచ్చాడనుకున్నా. కానీ ఇప్పుడు ఆ దేవుడే నాకు వరుస సినిమాల్లో నటించే అవకాశాన్ని కల్పించాడు. సుమారు ఐదేళ్ల నుంచి అమితాబ్ ప్రాజెక్ట్ తిరిగి ఎప్పుడు మొదలవుతుందోనని ఎదురుచూస్తున్నా’’ అని చెప్పారు.
‘‘నా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘Anbe Aaruyire’ ‘NEW’.. వంటి చిత్రాలు ప్రేక్షకులకు నన్ను చేరువ చేశాయి. అయితే, ఆయా చిత్రాలు వీక్షించి ఇండస్ట్రీలో ఉన్న పలువురు ప్రముఖులు నాపై కామెంట్స్ చేశారు. నా యాక్టింగ్ చెత్తగా ఉంటుందని విమర్శించారు. అలాంటి మాటలు విన్న తర్వాతే, నటుడిగా నన్ను నేను మెరుగుపరుచుకున్నా. ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటున్నా’’ అని సూర్య తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య