Indian 2 Movie: ‘భారతీయుడు2’లో నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది: ఎస్‌.జె.సూర్య

శంకర్‌, కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘భారతీయుడు2’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఎస్‌.జె.సూర్య

Updated : 06 Jul 2024 18:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘భారతీయుడు2’లో తన పాత్ర నిడివి తక్కువే అయినా, సినిమా, ప్రేక్షకులకుపై దాని ప్రభావం ఉంటుందని నటుడు, దర్శకుడు ఎస్‌.జె.సూర్య అన్నారు. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సూర్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘ఈ సినిమాలో నేను తెరపై కనిపించేది కొద్దిసేపే కావచ్చు. కానీ, ఆ సన్నివేశాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.’ అని సూర్య చెప్పుకొచ్చారు. ఇక శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న ‘గేమ్‌ఛేంజర్‌’లో తన నటన చూసి ‘భారతీయుడు2’లో అవకాశం ఇచ్చారని సూర్య చెప్పారు. ‘‘రామ్‌ చరణ్‌తో కలిసి చేసిన కొన్ని సన్నివేశాలను చూసిన శంకర్‌ నాకు ‘ఇండియన్‌ 2’లో విలన్‌ పాత్ర పోషించే అవకాశమిచ్చారు. ఇది నట జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేని పాత్రల్లో ఒకటి’’ అని సూర్య అన్నారు. విలన్‌ పాత్రలకు తనదైన మేనరిజాన్ని జోడించి దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ఎస్‌.జె.సూర్య.. శంకర్ భారీ ప్రాజెక్ట్‌లైన భారతీయుడు2, గేమ్‌ఛేంజర్‌లలో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని