
Published : 23 Mar 2021 16:35 IST
కన్నడ ‘సీడీ లేడీ’సినిమా!
బెంగుళూరు: కర్నాటక రాజకీయాల్లో కలకలం సృష్టించిన ‘సీడీ ఎపిసోడ్’ గురించి తెలిసిందే. కర్నాటక మంత్రి రమేశ్ జార్ఖిహోళి ఈ వివాదంలో ఒక మహిళకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్టు ఆరోపణలు ఎదర్కొంటున్నారు. దీంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే కథా నేపధ్యం ఇదో కాదో తెలియదు కానీ సినీ నిర్మాత, ప్రతిపక్ష జేడీ-ఎస్ నాయకుడు సందేశ్నాగరాజ్ ‘సీడీ లేడీ’అనే టైటిల్‌ను కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టేషన్ చేయించారు. ప్రస్తుతానికైతే ఆ చిత్రం కథగానీ, డైరెక్టర్ ఎవరన్నది కానీ నిర్ణయించుకోలేదన్నారు. తాము తీయబోయే చిత్రం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండనుందని మాత్రం వెల్లడించారు. గతంలో ఈయన ‘ఐరావత, ప్రిన్స్, మన్నిన ధోని, అమర్’ చిత్రాలను నిర్మించారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :